Nagpur Forced Conversion Case: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో సంచలనం సృష్టించిన ఐఏఎఫ్ (IAF) అధికారి భార్య బలవంతపు మతమార్పిడి, లైంగిక దాడి కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.
ఈ కేసులో తాజాగా హజ్రత్ మౌలానా అనే 24 ఏళ్ల మరో నిందితుడిని పోలీసులు మధ్యప్రదేశ్‌లో అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని బ్లాక్‌మెయిల్ చేసి, బలవంతంగా మతం మార్చడంతో పాటు వివాహం జరిపించడంలో ఇతడికి కూడా కీలక పాత్ర ఉన్నట్లు నిర్ధారణ కావడంతో అరెస్ట్ చేసారు.
IAF officer’s wife case: Another accused arrested.
Nagpur Forced Conversion Case: డ్రింక్‌లో మత్తుమందు, వీడియోలతో బ్లాక్‌మెయిల్
పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ (FIR) ప్రకారం.. బాధితురాలు గతంలో తనతో పాటు కలిసి చదువుకున్న అయాజ్ మదారే (26)పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఒక హోటల్‌లో తన డ్రింక్‌లో అయాజ్ మత్తుమందు కలిపి ఇచ్చాడని, తాను స్పృహ కోల్పోయిన సమయంలో అసభ్యకరమైన వీడియోలను రికార్డు చేశాడని ఆమె పేర్కొన్నారు. ఆ వీడియోలను భర్తకు, ఇతరులకు పంపిస్తానంటూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడి, తనపై పలుమార్లు లైంగిక దాడి చేయడమే కాకుండా రూ.4 లక్షల నగదును కూడా వసూలు చేశాడని బాధితురాలు ఫిర్యాదులో వివరించారు.
బలవంతపు పెళ్లి.. పోలీసుల ఆధీనంలో ముగ్గురు నిందితులు
ఈ వేధింపులు అంతటితో ఆగకుండా, నిందితుడు అయాజ్ తన స్నేహితులతో కలిసి బాధితురాలిని మరో ప్రాంతానికి తీసుకెళ్లి బలవంతంగా పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. ఈ బలవంతపు మతమార్పిడి, నికాహ్ ప్రక్రియలో తాజాగా అరెస్ట్ అయిన హజ్రత్ మౌలానా కీలక పాత్ర పోషించినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన అయాజ్ మదారేతో పాటు అతడికి సహకరించిన అమీన్ షేఖ్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేయగా, తాజా అరెస్ట్‌తో కలిపి మొత్తం నిందితుల సంఖ్య మూడుకు చేరింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో పోలీసులు ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:
సుశాంత్ వర్ధంతి రోజే నటి సంచిత ఆత్మహత్య.. సోదరుడి సంచలన ఆరోపణలు

