IPL Impact Player Rule: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో అత్యంత చర్చనీయాంశంగా మారిన 'ఇంపాక్ట్ ప్లేయర్' నిబంధన కొనసాగింపుపై మళ్లీ సందిగ్ధత నెలకొంది.
ఈ నిబంధనపై తమ తుది అభిప్రాయాలను తెలపాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఐపీఎల్ ఫ్రాంచైజీల యాజమాన్యాలను కోరింది. దీనికి సంబంధించి స్పష్టమైన నివేదికను పంపడానికి ఆగస్టు 31ని చివరి గడువుగా బీసీసీఐ నిర్ణయించింది.
Read Also :Abhay Singh: తువాంకు ముహ్రిజ్ ట్రోఫీ 2026 విజేతగా అభయ్ సింగ్

అసలేంటీ 'ఇంపాక్ట్ ప్లేయర్' రూల్? ఎందుకు వివాదాస్పదమైంది?
మ్యాచ్ మధ్యలో ఇన్నింగ్స్ పరిస్థితులకు అనుగుణంగా 11 మంది ప్లేయర్లతో పాటు అదనంగా మరో 12వ ఆటగాడిని (బ్యాటర్ లేదా బౌలర్) టీమ్‌లోకి తీసుకునేందుకు ఈ నిబంధన అవకాశం కల్పిస్తుంది. మ్యాచ్‌లో అదనపు బ్యాటర్ లేదా బౌలర్ అందుబాటులోకి రావడం వల్ల జట్లు విచ్చలవిడిగా బ్యాటింగ్ చేసి భారీ స్కోర్లు నమోదు చేశాయి. దీనివల్ల బౌలర్లకు ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోతోందని తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ రూల్ వల్ల భారత జట్టుకు అవసరమైన అల్‌రౌండర్ల ఎదుగుదల దెబ్బతింటోందని దిగ్గజ క్రీడాకారులు ఆందోళన వ్యక్తం చేశారు.
IPL Impact Player Rule: ప్రముఖ ఆటగాళ్ల వ్యతిరేకత & బీసీసీఐ తదుపరి అడుగులు
టీమిండియా నక్షత్ర క్రీడాకారులు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శుభ్‌మన్ గిల్ వంటి పలువురు స్టార్ ప్లేయర్లు ఈ నిబంధనను బహిరంగంగానే వ్యతిరేకించారు. అయితే టోర్నమెంట్‌లో వినోదం పెరిగిందనే కోణంలో కొందరు ఫ్రాంచైజీల ప్రతినిధులు దీనికి మద్దతుగా ఉన్నారు. బీసీసీఐ జట్లకు పంపిన లేఖలో అంపైరింగ్, ప్రాక్టీస్ సెషన్లు, మ్యాచ్ ప్రోటోకాల్స్ వంటి అంశాలు ఉన్నప్పటికీ.. ప్రధానంగా 'ఇంపాక్ట్ ప్లేయర్' రూల్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి అభిప్రాయాలు కోరింది. ఫ్రాంచైజీల నుంచి వచ్చే FeedBack ఆధారంగా రాబోయే ఐపీఎల్ సీజన్‌లో ఈ నిబంధనను ఉంచాలా లేదా రద్దు చేయాలా అనే దానిపై బీసీసీఐ తుది నిర్ణయం తీసుకోనుంది.

