Vaibhav Suryavanshi: ఐపీఎల్ 2026 సీజన్‌లో ఒకే ఒక్క పేరు క్రికెట్ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది ఆ పేరే వైభవ్ సూర్యవంశీ. రాజస్థాన్ రాయల్స్ (RR) కనుగొన్న ఈ 15 ఏళ్ల సంచలనం, తన అద్భుతమైన హిట్టింగ్‌తో సరికొత్త రికార్డులను తిరగరాస్తున్నాడు.
Vaibhav Suryavanshi 96 runs
తాజాగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన కీలకమైన క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో వైభవ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 47 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 96 పరుగులు బాదాడు. కేవలం 4 పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయినప్పటికీ, ఐపీఎల్ చరిత్రలో తన ముద్ర వేసుకున్నాడు.
Read also: GT VS RR Match :ఫైనల్‌కు గుజరాత్..ఆర్సీబీతో టైటిల్ ఫైట్!
వైభవ్ సూర్యవంశీ ఖాతాలో చేరిన అరుదైన రికార్డులు ఇవే:
700+ పరుగులు చేసిన తొలి అన్‌క్యాప్డ్ ప్లేయర్
అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడకుండానే, ఒకే ఐపీఎల్ సీజన్‌లో 700 పరుగుల మైలురాయిని దాటిన మొట్టమొదటి అన్‌క్యాప్డ్ బ్యాటర్‌గా వైభవ్ రికార్డు సృష్టించాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 16 మ్యాచ్‌లు ఆడిన అతను, 48.50 అద్భుతమైన సగటుతో 776 పరుగులు సాధించి అదరగొట్టాడు.
Vaibhav Suryavanshi: ఆండ్రీ రస్సెల్ రికార్డు బద్దలు!
ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా (ఎదుర్కొన్న బంతుల పరంగా) 1000 పరుగుల మార్కును అందుకున్న బ్యాటర్‌గా వైభవ్ అగ్రస్థానంలో నిలిచాడు. అతను కేవలం 440 బంతుల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం. గతంలో వెస్టిండీస్ పవర్ హిట్టర్ ఆండ్రీ రస్సెల్ (545 బంతులు) పేరిట ఉన్న రికార్డును ఈ 15 ఏళ్ల కుర్రాడు చెరిపేశాడు.
అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు
కేవలం 15 సంవత్సరాల 63 రోజుల వయసులోనే ఒక ఐపీఎల్ సీజన్‌లో 700 పైగా పరుగులు చేసిన ఏకైక క్రికెటర్‌గా వైభవ్ నిలిచాడు. గతంలో ఈ రికార్డు గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ సాయి సుదర్శన్ పేరిట ఉండేది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:

