Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం ఎత్తివేసిన బంగ్లాదేశ్.. క్రికెట్ ఫ్యాన్స్‌కు పండుగే!

ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం ఎత్తివేసిన బంగ్లాదేశ్.. క్రికెట్ ఫ్యాన్స్‌కు పండుగే!

వార్త 3 months ago

IPL in Bangladesh: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రసారాల విషయంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం తన వైఖరిని పూర్తిగా మార్చుకుంది. గతంలో ఐపీఎల్ ప్రసారాలపై విధించిన ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

క్రీడలను, రాజకీయాలను వేర్వేరుగా చూడాలని నిర్ణయించుకున్నట్లు బంగ్లాదేశ్ కొత్త సమాచార, ప్రసార శాఖ మంత్రి జహీర్ ఉద్దీన్ స్వపన్ వెల్లడించారు. ఈ నిర్ణయంతో పొరుగు దేశంలోని లక్షలాది మంది క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read Also:Virat Kohli IPL Records: గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో విరాట్ కోహ్లీ రికార్డుల వేట

 Bangladesh Lifts IPL Broadcast Ban

క్రీడల్లో రాజకీయాలకు చోటు లేదు: మంత్రి జహీర్ ఉద్దీన్

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఐపీఎల్ అంశాన్ని తాము కేవలం వాణిజ్య కోణంలోనే పరిశీలిస్తామని స్పష్టం చేశారు. “మేము క్రీడల్లోకి రాజకీయాలను తీసుకురావాలని భావించడం లేదు. స్టార్ స్పోర్ట్స్ వంటి అంతర్జాతీయ నెట్‌వర్క్‌లు ఐపీఎల్‌ను ప్రసారం చేయాలనుకుంటే మా నుంచి ఎలాంటి అభ్యంతరం ఉండదు. ఏదైనా ఛానెల్ ప్రసారాల కోసం అనుమతి కోరితే సానుకూలంగా స్పందిస్తాం” అని ఆయన వివరించారు.

IPL in Bangladesh: కేబుల్ ఆపరేటర్ల సంఘం హర్షం

ప్రభుత్వ తాజా నిర్ణయాన్ని బంగ్లాదేశ్ కేబుల్ ఆపరేటర్ల సంఘం (COAB) స్వాగతించింది. గత మధ్యంతర ప్రభుత్వం విధించిన ఆదేశాలకు ఇప్పుడు విలువ లేదని ఆ సంఘం కార్యదర్శి రెజాల్ కరీం లబ్లు తెలిపారు. ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రసారాలను అడ్డుకోవాలని తమకు ఎటువంటి అధికారిక ఆదేశాలు అందలేదని, కాబట్టి ఛానెల్స్ ప్రసారం చేస్తే తాము అడ్డుకోబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో బంగ్లాదేశ్ మీడియా మార్కెట్‌లో మళ్లీ ఐపీఎల్ సందడి మొదలుకానుంది.

గతంలో మహమ్మద్ యూనుస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల నేపథ్యంలో బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌తో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్‌) జట్టును బీసీసీఐ కోరింది. ఈ పరిణామంతో ఆగ్రహించిన నాటి బంగ్లా ప్రభుత్వం ఐపీఎల్ ప్రసారాలను దేశంలో నిలిపివేసింది. అయితే, కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ ఆంక్షలు తొలగిపోయాయి. తాజా ప్రకటనతో ఐపీఎల్ 2026 సీజన్ ప్రసారాలకు మార్గం సుగమమైంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

IPL 2026 తొలి మ్యాచ్.. ఎవరిది మొదటి గెలుపు?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha