DK Shivakumar : కర్ణాటకలో ఐపీఎల్ మ్యాచ్‌ల టికెట్ల కేటాయింపుపై నెలకొన్న వివాదానికి చివరకు పరిష్కారం లభించింది. ఈ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించినట్లు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ వెల్లడించారు.
ఎమ్మెల్యేలు, ఎంపీలకు మూడు టికెట్లు మాత్రమే
ఐపీఎల్ టికెట్ల అంశంపై ఇప్పటికే స్పీకర్ మరియు ఇతర సీనియర్ నాయకులతో చర్చలు జరిపినట్లు డీకే శివకుమార్ తెలిపారు. అనంతరం కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు డీఎన్ఏ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు.
ఈ సమావేశం అనంతరం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇకపై ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఐపీఎల్ మ్యాచ్‌లకు నాలుగు టికెట్లు ఇవ్వకుండా మూడు టికెట్లు మాత్రమే అందజేస్తారు. అంతర్జాతీయ మ్యాచ్‌లకు సంబంధించి కేఎస్‌సీఏ రెండు కాంప్లిమెంటరీ టికెట్లు ఇస్తుందని తెలిపారు. అదనంగా టికెట్లు కావాలంటే కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
టికెట్లు వద్దనుకుంటే లేఖ ఇవ్వాలి
ఈ చర్చల్లో భారత మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ కూడా పాల్గొన్నారు. టికెట్లు తీసుకోవాలనుకోని ప్రజాప్రతినిధులు అధికారికంగా లేఖ ద్వారా తెలియజేయవచ్చని డీకే శివకుమార్ తెలిపారు. ఈ నిర్ణయంతో టికెట్ల వివాదం పూర్తిగా ముగిసిందని ఆయన పేర్కొన్నారు. రాజస్థాన్, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా వంటి రాష్ట్రాల్లో ప్రభుత్వ అధికారులకు 50 నుంచి 60 శాతం వరకు టికెట్లు కేటాయిస్తారని ఆయన తెలిపారు. వాటితో పోలిస్తే కర్ణాటకలో ప్రభుత్వ జోక్యం చాలా తక్కువగా ఉందని చెప్పారు.
Read also: Health tips: సంతానలేమికి ప్రధాన కారణం ఇదేనా?
DK Shivakumarచిన్నస్వామి స్టేడియం విస్తరణ ప్రతిపాదన
బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం సామర్థ్యాన్ని పెంచే అంశంపై కూడా చర్చలు జరిగాయని డీకే శివకుమార్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న సీటింగ్ సామర్థ్యాన్ని మరో 20 వేల సీట్ల వరకు పెంచే ప్రతిపాదనపై అధికారులు నివేదిక సమర్పించాలని సూచించారు. ప్రతిపాదన అందిన తర్వాత ప్రభుత్వం దానిని పరిశీలిస్తుందని ఆయన వెల్లడించారు. రాజకీయ నాయకుల కోసం ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేయాలన్న అంశంపై తాను జోక్యం చేసుకోవాలనుకోవడం లేదని స్పష్టం చేశారు.
క్రీడా మౌలిక సదుపాయాలకు భూమి కేటాయింపు
రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే భూమిని కేటాయించినట్లు డీకే శివకుమార్ తెలిపారు. బెంగళూరులో గోల్డెన్ స్పా సమీపంలో 25 ఎకరాలు, తుమకూరులో మరో 25 ఎకరాలు, మైసూరులో కూడా కొంత భూమిని కేటాయించినట్లు చెప్పారు. కేవలం క్రికెట్ మాత్రమే కాకుండా పలు క్రీడలకు ఉపయోగపడేలా కొత్త మల్టీ స్పోర్ట్స్ స్టేడియంను నిర్మించేందుకు బెంగళూరులో రెండు మూడు ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

