Hardik Pandya Trade Deal: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) సీజన్‌లో ఘోర నిరాశను ఎదుర్కొని, పాయింట్ల పట్టికలో 9వ స్థానానికి పడిపోయిన ముంబై ఇండియన్స్ (MI) ఫ్రాంచైజీలో ఊహించని భారీ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
జట్టు కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ముంబై ఫ్రాంచైజీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తీవ్రమైన మానసిక ఒత్తిడి, డ్రెస్సింగ్ రూమ్‌లో విభేదాల కారణంగా 32 ఏళ్ల పాండ్యా పరస్పర అంగీకారంతోనే ముంబై ఇండియన్స్‌తో విడిపోవడానికి సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో, అతడిని తమ గూటికి చేర్చుకోవడానికి ఐపీఎల్ ఫ్రాంచైజీల మధ్య మునుపెన్నడూ లేని విధంగా భారీ ‘ట్రేడ్ వార్’ (Trade War) మొదలైంది. ప్రస్తుతం లీగ్‌లోని ప్రధాన ఫ్రాంచైజీలైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మినహా మిగతా ఏడు ఫ్రాంచైజీలు హార్దిక్ పాండ్యాను దక్కించుకునేందుకు తీవ్రంగా ఆసక్తి చూపుతున్నాయి.
Read Also:Womens T20 World Cup: మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరిన ఆస్ట్రేలియా
రేసులోకి లేట్‌గా ఎంటరైనా దూసుకెళ్తున్న CSK!
హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ రేసులో ప్రారంభంలో నెమ్మదిగా వ్యవహరించిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK), ప్రస్తుతం అత్యంత బలమైన పోటీదారుగా అవతరించింది. ఎంఎస్ ధోనీ తర్వాతి శకంలో (Post-MS Dhoni Era) జట్టును సమర్థవంతంగా నడిపించగల, మ్యాచ్‌లను ఒంటిచేత్తో గెలిపించగల ఆల్‌రౌండర్‌గా సీఎస్‌కే మేనేజ్‌మెంట్ పాండ్యాను భావిస్తోంది. అయితే, చెన్నై జట్టులో అతనికి తక్షణమే కెప్టెన్సీ ఇస్తారనే గ్యారెంటీ లేనప్పటికీ, ఒక కీలక పాత్రను ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం.
కెప్టెన్సీ అస్త్రంతో KKR, RR లూటీ..
మరోవైపు, ప్రస్తుతం జట్టుకు ఒక శాశ్వతమైన, నమ్మకమైన కెప్టెన్ కోసం వెతుకుతున్న కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), హార్దిక్‌కు నేరుగా నాయకత్వ బాధ్యతలు (Captaincy) అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు టాక్. దీంతో పాటు రాజస్థాన్ రాయల్స్ (RR) కూడా దీర్ఘకాలిక ప్రణాళికలతో హార్దిక్‌కు కెప్టెన్సీతో పాటు ఫ్రాంచైజీలో కీలకమైన ప్రాధాన్యతను ఆఫర్ చేస్తూ సంప్రదింపులు జరుపుతోంది.
Hardik Pandya Trade Deal: క్లిష్టమైన ఐపీఎల్ ట్రేడ్ డీల్.. ఏం జరగబోతోంది?

ప్రస్తుతం ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య అంతర్గత చర్చల ఛానెల్స్ యాక్టివ్‌గా ఉన్నప్పటికీ, ఏ ఫ్రాంచైజీ కూడా దీనిపై అధికారిక ప్రకటన చేయలేదు. ఐపీఎల్ ట్రేడింగ్ నిబంధనల ప్రకారం.. ఈ డీల్ పూర్తిగా నగదు రూపంలో (All-Cash Deal) జరుగుతుందా? లేక ఆటగాళ్ల మార్పిడి (Player Swap) ఉంటుందా? అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఒకవేళ ఆటగాళ్ల మార్పిడి జరిగితే CSK ఎవరిని వదులుకుంటుంది? లేదా KKR వద్ద ముంబై మెచ్చే అంతటి విలువైన ఆటగాడు ఉన్నాడా? అనే ప్రశ్నలు మిగిలే ఉన్నాయి.
గత సీజన్‌లో సంజు శాంసన్, రవీంద్ర జడేజా, సామ్ కర్రన్‌ల మధ్య జరిగిన ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద బ్లాక్‌బస్టర్ ట్రేడ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన అనుభవం CSKకు ఉంది. అందుకే ఈసారి కూడా చెన్నై వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అయితే, ఐపీఎల్ ట్రేడ్ మార్కెట్‌లో ఆటగాడి పూర్తి అంగీకారం, ఫ్రాంచైజీల మధ్య ఆర్థిక నిబంధనలు ముడిపడి ఉంటాయి కాబట్టి, చివరి నిమిషంలో ఎలాంటి ఊహించని మార్పులైనా చోటుచేసుకునే అవకాశం ఉంది.
Epaper: epaper.vaartha.com

