Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని సస్పెన్షన్ మరోసారి పొడిగింపు

ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని సస్పెన్షన్ మరోసారి పొడిగింపు

వార్త 2 weeks ago

Vishal Gunni IPS Suspension: ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో తీవ్ర ఆరోపణలు, వివాదాస్పద కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న సీనియర్ ఐపీఎస్ అధికారి విశాల్ గున్నికి రాష్ట్ర ప్రభుత్వం మరోసారి షాక్ ఇచ్చింది.

ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ను మరికొంత కాలం పొడిగిస్తూ శనివారం అధికారిక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సాయి ప్రసాద్ జీవో జారీ చేశారు.

 AP Govt Extends Suspension

సెప్టెంబర్ 4 వరకు సస్పెన్షన్ పొడిగింపు.. కారణం ఇదే!

తాజా ఉత్తర్వుల ప్రకారం విశాల్ గున్ని సస్పెన్షన్‌ను సెప్టెంబర్ 4వ తేదీ వరకు పొడిగించారు. ఆయనపై నమోదైన క్రిమినల్ కేసు దర్యాప్తు పూర్తిగా ముగిసే వరకు లేదా సెప్టెంబర్ 4 వరకు (ఈ రెండింటిలో ఏది ముందైతే అది) ఈ సస్పెన్షన్ వేటు కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రిమినల్ కేసు (FIR నెం. 469/2024) ఆధారంగా ఆయనపై విచారణ సాగుతోంది.

Read also: Bolla Brahmanaidu: బొల్లా బ్రహ్మనాయుడుకి బెయిల్ మంజూరు

విశాల్ గున్ని పాత సస్పెన్షన్ గడువు ముగుస్తున్న తరుణంలో.. దీనిపై సమీక్షించేందుకు జూన్ 12న ఉన్నత స్థాయి రివ్యూ కమిటీ ప్రత్యేకంగా సమావేశమైంది. విశాల్ గున్ని సీనియర్ పోలీస్ హోదాలో ఉన్నందున, ప్రస్తుత తరుణంలో ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేసి మళ్లీ విధుల్లోకి తీసుకుంటే కేసు దర్యాప్తును, కీలక సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని కమిటీ అభిప్రాయపడింది. ఆయన విధుల్లో ఉంటే క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ సజావుగా సాగడం కష్టమని రివ్యూ కమిటీ ప్రభుత్వానికి నివేదించింది.

Vishal Gunni IPS Suspension: జెత్వానీ కేసు వివాదం.. క్యాట్ వర్సెస్ హైకోర్టు

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన సినీ నటి కాదంబరి జెత్వానీ అక్రమ అరెస్టు, వేధింపులు మరియు అధికార దుర్వినియోగం ఉదంతంలో విశాల్ గున్ని ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించిన ప్రస్తుత కూటమి ప్రభుత్వం గతంలోనే ఆయనను విధుల్లోంచి సస్పెండ్ చేసింది.

అయితే, ఈ సస్పెన్షన్ వేటును సవాల్ చేస్తూ విశాల్ గున్ని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (CAT)ను ఆశ్రయించారు. విచారణ అనంతరం క్యాట్ ఆయన సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ట్రిబ్యునల్ ఇచ్చిన ఈ తీర్పుపై ఏపీ ప్రభుత్వం వెంటనే హైకోర్టును ఆశ్రయించగా.. క్యాట్ ఆదేశాలపై ఉన్నత న్యాయస్థానం స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సస్పెన్షన్‌ను మరింత కాలం పొడిగిస్తూ తాజా ఆదేశాలు ఇచ్చింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

వైజాగ్ టెకీ గాయత్రి మృతిపై కన్నవారి సంచలన అనుమానాలు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha