Dailyhunt
ఐపీఎస్ అధికారిణినే వస్తావా.. నీ రేటు ఎంత అని అడిగిన పోకిరీలు..

ఐపీఎస్ అధికారిణినే వస్తావా.. నీ రేటు ఎంత అని అడిగిన పోకిరీలు..

వార్త 2 days ago

IPS Sumathi Malkajgiri CP: మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్న వెంటనే IPS సుమతి గ్రౌండ్ లెవెల్ పరిస్థితులపై దృష్టి పెట్టారు. రాత్రి 12 గంటల సమయంలో దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్‌లో ఎలాంటి సెక్యూరిటీ లేకుండా, సాధారణ మహిళలా వేషం మార్చుకుని బస్టాండ్‌లోకి వెళ్లారు.

ఆమె ఎవరో తెలియక కొందరు పోకిరీలు ఆమెను చుట్టుముట్టి వస్తావా? నీ రేటు ఎంత? ఎంతివ్వాలంటూ అంటూ వెకిలి ప్రశ్నలు అడగడం ప్రారంభించారు.

Read Also :Kamareddy Road Accident:పెళ్లింట రోడ్డు ప్రమాదం..ఎనిమిది మందికి గాయాలు

IPS Sumathi Malkajgiri CP: ఆ మూడు గంటలలో ఎలాంటి పెట్రోలింగ్ వాహనం గానీ, పోలీసులు గానీ అక్కడికి రాకపోవడంతో మరింతగా రెచ్చిపోయారు.. అక్కడ ఉన్న వారిలో ఎక్కువ మంది విద్యార్థులు, ఉద్యోగార్థులు మద్యం మరియు గంజాయి మత్తులో ఉన్నట్టు ఆమె గుర్తించారు.మూడున్నర గంటల తర్వాత ఒక బీట్ కానిస్టేబుల్ అక్కడికి రావడంతో ఆమె గుర్తింపు బయటపడింది. వెంటనే ఎస్సై వచ్చి సెల్యూట్ చేయడంతో ఆమె IPS కమిషనర్ సుమతి అని తెలిసింది. మొత్తం దాదాపు 40 మంది పోకిరీలను పోలీసులు అదుపులోకి తీసుకుని వారికి కౌన్సిలింగ్ ఇచ్చి, మద్యం-గంజాయి అలవాట్లు, రోడ్లపై అసభ్య ప్రవర్తనపై గట్టి హెచ్చరిక చేశారు..!

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

బెంగాల్ లో ఎన్నికల అనంతర హింస.. ఇద్దరు మృతి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha