Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఐస్‌క్రీమ్ గొడవ ప్రాణం తీసింది..అసలేం జరిగింది?

ఐస్‌క్రీమ్ గొడవ ప్రాణం తీసింది..అసలేం జరిగింది?

వార్త 3 months ago

UP Crime: ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో సభ్య సమాజం తలదించుకునేలా ఒక అత్యంత భయంకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం చిన్నపాటి గొడవ కారణంగా ఒక వ్యక్తి, ఐస్‌క్రీమ్ అమ్ముకునే యువకుడి తల నరికి, ఆ తలను తన ఇంటికి తీసుకెళ్లి దాని పక్కనే వంట చేసుకుంటూ పోలీసులకు పట్టుబడ్డాడు.

ఈ ఘటన విన్నవారంతా ఒళ్లు గగుర్పొడిచే భయానికి గురవుతున్నారు.

Read Also:Jangarai Robbery Case: సంచలనం సృష్టించిన వృద్ధులపై దాడి కేసు ఛేదన!

UP Crime: ఘటన వివరాలు

బారాబంకి జిల్లాలోని పర్సావల్ గ్రామంలో శనివారం ఈ దారుణం జరిగింది.బబ్లు (25), ఒక నిరుపేద ఐస్‌క్రీమ్ విక్రేత. తన కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటూ ముగ్గురు సోదరులు, భార్య, చిన్న పిల్లలను పోషిస్తున్నాడు.శంకర్ యాదవ్ (50), అదే గ్రామానికి చెందిన వ్యక్తి. శనివారం మధ్యాహ్నం బబ్లు ఐస్‌క్రీమ్ అమ్ముతూ శంకర్ యాదవ్ ఇంటి సమీపానికి వెళ్లినప్పుడు, ఇద్దరి మధ్య చిన్నపాటి వాగ్వాదం మొదలైంది. ఆ గొడవ ముదరడంతో ఆగ్రహానికి లోనైన శంకర్ యాదవ్, తన వద్ద ఉన్న కొడవలితో బబ్లుపై దాడి చేసి మెడను మొండెం నుంచి వేరు చేశాడు.

Ice Cream Vendor Beheaded

తల పక్కనే వంట.. పోలీసుల దిగ్భ్రాంతి

హత్య చేసిన తర్వాత శంకర్ యాదవ్ ఏమాత్రం భయం లేకుండా, తెగిపడిన బబ్లు తలను చేత్తో పట్టుకుని తన ఇంటికి తీసుకెళ్లాడు. సమాచారం అందుకున్న బారాబంకి ఎస్పీ అర్పిత విజయవర్గీయ తన బృందంతో నిందితుడి ఇంటిని ముట్టడించారు. పోలీసులు లోపలికి వెళ్లినప్పుడు అక్కడ కనిపించిన దృశ్యం వారిని నివ్వెరపోయేలా చేసింది. నిందితుడు శంకర్ యాదవ్ ఆ తెగిపడిన తలను పక్కనే స్టౌ వద్ద పెట్టుకుని, ఏమీ ఎరగనట్టుగా వంట చేసుకుంటున్నాడు. పోలీసులు వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని హత్యకు వాడిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు.

బాధితుడి కుటుంబం రోదన

మృతుడు బబ్లు మరణవార్త తెలియగానే అతని కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. బబ్లు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.కష్టపడి కుటుంబాన్ని సాకుతున్న వ్యక్తి ఇలా చిన్న కారణానికి బలైపోవడం గ్రామస్తులను కలచివేసింది. నిందితుడు శంకర్ యాదవ్ మానసిక స్థితిపై కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆ చిన్న గొడవ ఇంతటి అమానుష హత్యకు దారితీయడానికి గల కారణాలపై లోతైన దర్యాప్తు కొనసాగుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ఆ తల్లికి ఎం కష్టం వచ్చిందో ఇద్దరు పిల్లల్ని చంపి తల్లి ఆత్మహత్య

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha