Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఐస్‌క్రీమ్ మార్కెట్‌లోకి రిలయన్స్..'బాంబే క్రీమరీ' క్రీమ్ బ్రాండ్‌

ఐస్‌క్రీమ్ మార్కెట్‌లోకి రిలయన్స్..'బాంబే క్రీమరీ' క్రీమ్ బ్రాండ్‌

వార్త 2 weeks ago

Reliance : దేశీయ ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన ఎఫ్‌ఎంసిజి (FMCG) విభాగం రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL), భారత ఐస్ క్రీమ్ రంగంలోకి అధికారికంగా అడుగుపెట్టింది.

సెప్టెంబర్ 1న ‘బాంబే క్రీమరీ’ (Bombay Creamery) పేరుతో నూతన డెయిరీ ఐస్ క్రీమ్ బ్రాండ్‌ను ప్రారంభించినట్లు కంపెనీ వెల్లడించింది. భారతీయ ఐస్ క్రీమ్ మార్కెట్లో సుదీర్ఘకాలం పాటు విస్తరించాలనే వ్యూహాత్మక ప్రణాళికలో భాగంగా ఈ వ్యాపార విభాగంలోకి అడుగుపెట్టినట్లు ఆర్‌సిపిఎల్ స్పష్టం చేసింది. రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ తనకున్న బలమైన దేశవ్యాప్త పంపిణీ వ్యవస్థ.. విస్తృతమైన రిటైల్ నెట్‌వర్క్, వినూత్న మార్కెటింగ్ అవగాహనను ఉపయోగించుకుని బాంబే క్రీమరీ ఉత్పత్తులను దేశంలోని మూలమూలలకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రీమియం నాణ్యత కలిగిన ఉత్పత్తులను సాధారణ వినియోగదారుల బడ్జెట్‌కు అనుగుణంగా అందించడమే ఈ బ్రాండ్ ప్రధాన ఉద్దేశం.

Read Also: Ration Card Updates: రేషన్ కార్డు ఈ-కేవైసీ మొబైల్ ప్రాసెస్

 Reliance Ice cream

Reliance : మీగడ ఆధారంగా తయారు

కారణమిదే.. బాంబే క్రీమరీ ఐస్ క్రీమ్‌లను వంటనూనెలు లేదా ఇతర కృత్రిమ కొవ్వులకు బదులుగా స్వచ్ఛమైన పాల మీగడ (Real Dairy Cream) ఆధారంగా తయారు చేస్తున్నట్లు రిలయన్స్ ప్రకటించింది. అత్యుత్తమ నాణ్యతతో ప్రపంచ స్థాయి రుచులను అందించడంలో ఎటువంటి రాజీ పడబోమని, అందుబాటు ధరల్లోనే ప్రీమియం డెయిరీ అనుభవాన్ని అందించడమే తమ సిద్ధాంతమని పేర్కొంది. వినియోగదారుల విభిన్న అభిరుచులకు అనుగుణంగా కోన్‌లు, కప్పులు, టబ్‌లు, బార్‌లు మరియు స్టిక్స్ రూపాల్లో విభిన్న ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులను అత్యంత ఆకర్షిస్తున్న అంశం ఈ బ్రాండ్ ప్రారంభ ధర. బాంబే క్రీమరీ ఉత్పత్తులు కేవలం రూ. 10 ప్రాథమిక ధర నుంచే లభించనున్నాయి.

Epaper: epaper.vaartha.com

ఇందిరమ్మ ఇళ్ల తుది పరిశీలన అప్‌డేట్స్ ఇవే

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha