Infosys Company : భారతీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తమ ఉద్యోగ నియామక ప్రక్రియలో చోటుచేసుకున్న నకిలీ గుర్తింపులు, అవకతవకలపై తీవ్రంగా స్పందించింది.
అభ్యర్థుల ఎంపికలో అక్రమాలు జరిగినట్లు కొన్ని కేసులను గుర్తించిన నేపథ్యంలో, ఏకంగా 20 వేల మందికి పైగా అభ్యర్థులకు సంబంధించిన ఆన్‌లైన్ అసెస్‌మెంట్‌లు , ప్రత్యక్ష మూల్యాంకనాలను కంపెనీ తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ (TOI) పత్రిక ఒక ప్రత్యేక కథనంలో నివేదించింది. కంపెనీలో ప్రతిష్టాత్మకమైన ‘స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ – ట్రైనీ’ , ‘డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్ – ట్రైనీ’ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ ఈ వాయిదా నిర్ణయం వర్తిస్తుందని ఐటీ వర్గాలు వెల్లడించాయి.
Read Also: SBI: కేంద్రానికి SBI రూ.8,813 కోట్ల డివిడెండ్
Infosys Company
Infosys Company : అక్రమాలను పసిగట్టిన వెంటనే అప్రమత్తమైన కంపెనీ
తమ నియామక పరీక్షల సమగ్రతను, విశ్వసనీయతను దెబ్బతీసేందుకు కొందరు అభ్యర్థులు నకిలీ పద్ధతుల్లో ప్రయత్నించినట్లు ఇన్ఫోసిస్ అంతర్గత విచారణలో తేలింది. ఈ అక్రమాలను పసిగట్టిన వెంటనే అప్రమత్తమైన కంపెనీ యాజమాన్యం ప్రస్తుత పరీక్షలను నిలిపివేయడమే కాకుండా, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా తమ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ (ధృవీకరణ) యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేసింది. పరీక్షల నిర్వహణలో కాపీయింగ్, మాల్‌ప్రాక్టీస్‌కు తావులేకుండా అదనపు అత్యాధునిక సాంకేతిక భద్రతా చర్యలను కూడా ప్రవేశపెట్టినట్లు నివేదిక స్పష్టం చేసింది. ఈ పరిణామాలపై సదరు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇన్ఫోసిస్ ఒక అధికారిక ఈమెయిల్ ప్రకటనను పంపింది. “స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ (ట్రైనీ) మరియు డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్ (ట్రైనీ) పోస్టుల భర్తీ కోసం నిర్వహించాల్సిన ఆన్‌లైన్ నియామక పరీక్షలకు సంబంధించి మా వద్ద ఒక ముఖ్యమైన అప్‌డేట్ ఉంది. అనివార్య కారణాల వల్ల ముందుగా షెడ్యూల్ చేసిన అసెస్‌మెంట్ ప్రక్రియ ప్రస్తుతం వాయిదా వేయబడిందని కంపెనీ ఆ సందేశంలో పేర్కొన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం తెలిపింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

