Samantha Post on Akhil: అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన 'లెనిన్' సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ఈ చిత్రం ఈరోజు శుక్రవారం (జులై 10, 2026) ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది.
మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖిల్.. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారని పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. ముఖ్యంగా యూఎస్ ప్రీమియర్స్ నుంచే ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. అయితే, ఈ క్రమంలో అఖిల్‌కు టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత బెస్ట్ విషెస్ అందజేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Read Also : Film Nagar Car Accident: టాలీవుడ్ నటుడు ధర్మ ఇంట్లోకి దూసుకెళ్లిన కారు
Samantha’s special post on Akhil’s movie… wishes it to be a ‘blockbuster’!
Samantha Post on Akhil: ఇన్‌స్టాగ్రామ్‌లో సమంత క్రేజీ పోస్ట్
అఖిల్ తో పాటుగా ‘లెనిన్’ టీమ్ మొత్తానికి సమంత సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ”లెనిన్ చిత్ర బృందానికి, అఖిల్‌కు ఆల్ ది వెరీ బెస్ట్. ఆల్రెడీ బిగ్ బ్లాక్ బస్టర్ వైబ్స్ కనిపిస్తున్నాయి” అని సామ్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చారు. అఖిల్‌ను ట్యాగ్ చేస్తూ సినిమా ట్రైలర్‌ను కూడా పంచుకున్నారు. అక్కినేని హీరోకి సమంత తన బెస్ట్ విషెస్ అందజేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
సమంత యాక్షన్ సీన్స్‌పై అఖిల్ ప్రశంసలు
ఇటీవల సమంత నటించిన 'మా ఇంటి బంగారం' సినిమాపై అఖిల్ ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. ‘లెనిన్’ మూవీ ప్రచారంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో అఖిల్ మాట్లాడుతూ.. సామ్ సినిమా చాలా ఫ్రెష్ కాన్సెప్ట్‌తో వచ్చిందని కొనియాడారు. నేను ‘లెనిన్’ సినిమా పనుల్లో బిజీగా ఉండడం వల్ల ఇంకా ‘మా ఇంటి బంగారం’ చూడలేదు. కానీ మూవీ ట్రైలర్ చూశాను, నాకు చాలా బాగా నచ్చింది. ‘మా ఇంటి బంగారం’ అని పేరు పెట్టుకొని, ఒక ఇంట్లో అలాంటి యాక్షన్ సీన్స్ తీయడం ఇంట్రెస్టింగ్ గా ఉంది. ముఖ్యంగా ఒక మహిళా పాత్రతో ఆ లెవల్ యాక్షన్ సీన్స్ చేయించడం నిజంగా అద్భుతం. సమంత నటన ప్రశంసనీయం. కంగ్రాట్స్ సామ్” అని అఖిల్ పేర్కొన్నారు. ఈ ప్రశంసలకు బదులుగానే ఇప్పుడు సమంత కూడా అఖిల్ సినిమాకు మద్దతుగా నిలిచారని ఫ్యాన్స్ అంటున్నారు.
మాస్ లుక్‌లో దుమ్మురేపిన 'అయ్యగారు'
మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో ‘లెనిన్’ సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో ఒక రూరల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. ఇందులో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. అఖిల్ తన కెరీర్ లోనే మొదటిసారిగా పక్కా మాస్ క్యారక్టర్ లో కనిపించి, డైలాగ్ డెలివరీతో, నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. అక్కినేని నాగార్జున, నాగవంశీ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి స్టార్ కంపోజర్ ఎస్.థమన్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. రెండు వైపులా నటీనటులు ఒకరి సినిమాలను ఒకరు సపోర్ట్ చేసుకుంటూ హెల్తీ వాతావరణాన్ని క్రియేట్ చేయడం పట్ల నెటిజన్లు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

