Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అక్టోబర్ 1 నుంచి అమల్లోకి జనన, మరణాల నమోదు చట్టం

అక్టోబర్ 1 నుంచి అమల్లోకి జనన, మరణాల నమోదు చట్టం

వార్త 2 weeks ago

Registration of Births and Deaths Act : దేశవ్యాప్తంగా జనన, మరణాల నమోదు ప్రక్రియను మరిన్ని పారదర్శకంగా మార్చడంతో పాటు ఆలస్యాన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ చట్టం (Registration of Births and Deaths Amendment Act) అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది.

ఈ సవరణ బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన అనంతరం, ఇటీవల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కూడా తన ఆమోద ముద్ర వేశారు. దీంతో భారత రిజిస్ట్రార్ జనరల్ మృత్యుంజయ్ కుమార్ గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. పౌరుల డిజిటల్ డేటాబేస్‌ను సక్రమంగా నిర్వహించడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు వేగంగా అందేలా చూడడం ఈ చట్టం ముఖ్య ఉద్దేశం.

రెండేళ్లు దాటితే మేజిస్ట్రేట్ అనుమతి తప్పనిసరి: కొత్త నిబంధనలు ఇవే

ఈ కొత్త చట్టం ప్రకారం జనన లేదా మరణ వివరాలను నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన నిబంధనలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఘటన ముందస్తు అనుమతి పొందడం విధిగా మారింది. విద్యాసంస్థల్లో ప్రవేశాలు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్ పొందేందుకు అలాగే వివాహ నమోదు వంటి అన్ని రకాల సేవలకు డిజిటల్ జనన ధ్రువీకరణ పత్రాన్ని (Birth Certificate) ఒకే ఒక్క ప్రామాణిక పత్రంగా పరిగణించేలా ఈ చట్టంలో స్పష్టమైన మార్పులు చేశారు.

దేశంలో త్రిభాషా విధానం అమలుపై సుప్రీంకోర్టు కీలక సూచన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha