Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అక్టోబర్ 1 నుంచి ఎస్బీఐ ఏటీఎం నిబంధనల్లో మార్పులు

అక్టోబర్ 1 నుంచి ఎస్బీఐ ఏటీఎం నిబంధనల్లో మార్పులు

వార్త 2 weeks ago

SBI ATM Rules: భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) శాలరీ అకౌంట్ ఖాతాదారులకు కీలక మార్పు చేసింది. ఇతర బ్యాంకుల ఏటీఎంలలో ఉచితంగా చేసుకునే నెలవారీ లావాదేవీల పరిమితిని సవరించింది.

ఈ కొత్త నిబంధనలు 2026 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో ఎస్బీఐ శాలరీ ప్యాకేజీ ఖాతాదారులు ఇకపై ఇతర బ్యాంకుల ఏటీఎంలను వినియోగించే సమయంలో కొత్త పరిమితులను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

Read Also : SBI UPI Services Down: సెప్టెంబర్ 4న SBI యూపీఐ సేవలకు అంతరాయం

 Changes to SBI ATM rules from October 1

SBI ATM Rules: ఉచిత లావాదేవీలు 10 నుంచి 5కి కుదింపు

ప్రస్తుతం ఎస్బీఐ శాలరీ ప్యాకేజీ ఖాతా కలిగిన కస్టమర్లు ఇతర బ్యాంకులకు చెందిన ఏటీఎంలు లేదా ఆటోమేటెడ్ డెబిట్ కమ్ విత్‌డ్రాయల్ మెషీన్ల (ADWM) ద్వారా నెలకు 10 వరకు ఉచిత లావాదేవీలు ఉచితంగా పొందుతున్నారు. అయితే కొత్త నిబంధనల ప్రకారం, ఈ పరిమితిని 5 లావాదేవీలకు (ఆర్థిక మరియు ఆర్థికేతర లావాదేవీలు కలిపి) పరిమితం చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

పరిమితి దాటితే పడే రుసుములు

నెలకు కేటాయించిన 5 ఉచిత లావాదేవీల పరిమితి దాటిన తర్వాత చేసే ప్రతి లావాదేవీకి కస్టమర్లు క్రింది విధంగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది:

  • ఆర్థిక లావాదేవీలు (నగదు ఉపసంహరణ): రూ. 23 + జీఎస్టీ (GST)
  • ఆర్థికేతర లావాదేవీలు (బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్‌మెంట్ మొదలైనవి): రూ. 11 + జీఎస్టీ (GST)

ఈ మార్పు కేవలం ఇతర బ్యాంకుల ఏటీఎంలను ఉపయోగించే శాలరీ ఖాతాదారులకు మాత్రమే వర్తిస్తుందని బ్యాంక్ స్పష్టత ఇచ్చింది. ఎస్బీఐకి చెందిన సొంత ఏటీఎంలలో లావాదేవీలు జరిపినప్పుడు శాలరీ ఖాతాదారులకు మునుపటిలాగే ఎటువంటి అదనపు ఛార్జీలు లేదా పరిమితులు ఉండవు. అలాగే, సాధారణ సేవింగ్స్ ఖాతాదారులకు ఉన్న పాత నిబంధనలు యథాతథంగా కొనసాగుతాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha