Cockroach Janata Party: దేశ రాజకీయాలో సరికొత్త చర్చకు దారితీస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) అక్టోబర్ 2 నుంచి దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేసే వరకు ఈ ఉద్యమం ఆపేది లేదని ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం అనుసరిస్తున్న విధానాలపై పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.

ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియ నిలిపివేత మరియు ఓటర్ల జాబితా డిమాండ్
ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని కాక్రోచ్ జనతా పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తోంది. ఎలాంటి లోపాలకు తావులేకుండా, జనవరి 2025 నాటి ఓటర్ల జాబితాను మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ఎన్నికలు నిర్వహించాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. పారదర్శకత లేని విధానాల వల్ల ఓటర్లు నష్టపోతున్నారని ఆరోపిస్తున్నారు.
Cockroach Janata Party: ముంబయి శివాజీ పార్క్‌లో ‘జైల్ భరో’ ఆందోళన
ఈ దేశవ్యాప్త నిరసనల్లో భాగంగా అక్టోబర్ 2న ముంబయిలోని చారిత్రాత్మక శివాజీ పార్క్ వేదికగా ‘జైల్ భరో’ ఆందోళనకు పార్టీ శ్రీకారం చుట్టనుంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ మరియు ఎన్నికల సంఘం తీరుపై తమ నిరసన గళాన్ని మరింత తీవ్రతరం చేయనున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ వర్గాలు వెల్లడించాయి.

