Khamenei Funeral: పశ్చిమాసియా (West Asia) భౌగోళిక రాజకీయాల్లో అత్యంత భారీ చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ (అత్యున్నత ఆధ్యాత్మిక నాయకుడు) అలీ ఖమేనీ అంత్యక్రియల వేడుకకు హాజరుకావాల్సిందిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) కి ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ (Masoud Pezeshkian) అధికారిక ఆహ్వానం పంపినట్లు అంతర్జాతీయ దౌత్య వర్గాలు వెల్లడించాయి.
గత ఫిబ్రవరిలో ఇజ్రాయెల్, అమెరికా వైమానిక దాడుల్లో ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో వాయిదా పడుతూ వచ్చిన ఆయన అధికారిక అంత్యక్రియల షెడ్యూల్‌ను ఇరాన్ స్టేట్ మీడియా ఎట్టకేలకు ఖరారు చేసింది. జూలై 4 నుంచి జూలై 9, 2026 వరకు ఈ అంతిమ సంస్కారాల ప్రక్రియ అత్యంత భారీ స్థాయిలో జరగనుంది.
చరిత్రాత్మక షెడ్యూల్ - 2 కోట్ల మందితో రికార్డ్?

ఇస్లామిక్ చట్టాల ప్రకారం మృతదేహాన్ని వీలైనంత త్వరగా ఖననం చేయాల్సి ఉన్నప్పటికీ.. యుద్ధం మరియు దేశ రక్షణ పరిస్థితుల దృష్ట్యా ఇరాన్ ఈ మినహాయింపు తీసుకుంది. జూలై 4న ప్రారంభం కానున్న ఈ వీడ్కోలు వేడుకల్లో భాగంగా.. జూలై 7న టెహ్రాన్ దక్షిణాన ఉన్న పవిత్ర నగరం 'కోమ్' (Qom) లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. అనంతరం జూలై 9న ఖమేనీ సొంత గడ్డ అయిన ఈశాన్య ఇరాన్ పవిత్ర నగరం మషద్ (Mashhad) లో అంత్యక్రియలు (Burial) పూర్తి కానున్నాయి. ఈ అంత్యక్రియల ఉత్సవాలకు టెహ్రాన్, కోమ్, మషద్ నగరాల్లో కలిపి దాదాపు 2 కోట్ల (20 Million) మంది శోకసంద్రం తరలివచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇదే కనుక నిజమైతే.. 1989లో ఇరాన్ వ్యవస్థాపకుడు అయాతొల్లా రుహొల్లా ఖొమేనీ అంత్యక్రియలకు హాజరైన 1 కోటి మంది రికార్డు బద్దలు కానుంది. ఈ వేడుకకు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) తో పాటు పలు దేశాల అగ్రనేతలు హాజరుకానున్నారు.
ఇరాన్ నూతన నాయకత్వంపై అమెరికా అనుమానాలు
ఖమేనీ మరణం తర్వాత మార్చి 8 నుంచి ఆయన 56 ఏళ్ల కుమారుడు మొజ్తబా హొస్సేని ఖమేనీ (Mojtaba Hosseini Khamenei) ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టారు. అయితే, ఆయన ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో 'కోమా' (Coma) లో ఉన్నట్లు అమెరికా సీనియర్ అధికారులు మార్కో రూబియో, పీట్ హెగ్‌సెత్‌లు సంచలన క్లెయిమ్స్ చేస్తుండటం అంతర్జాతీయంగా ఉత్కంఠ రేపుతోంది.
Khamenei Funeral: యూఎస్-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం
పశ్చిమాసియాను ముంచెత్తిన తీవ్ర ఇంధన, శక్తి సంక్షోభానికి (Global Fuel Crunch) తెరదించుతూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్‌లు విడివిడిగా డిజిటల్ ఎంఓయూలపై (Digital MoUs) సంతకాలు చేసి శాంతి ఒప్పందాన్ని (Peace Deal) కుదుర్చుకున్నారు. ప్రస్తుతం స్విట్జర్లాండ్ వేదికగా ఇరు దేశాల మధ్య దీర్ఘకాలిక వ్యూహాత్మక శాంతి చర్చలు కొనసాగుతున్నాయి.
Epaper: epaper.vaartha.com
భారతీయులు అలాంటి వాటికి ఖర్చు పెట్టరు.. ఉక్రెయిన్‌పై డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

