Alias Rukmini Movie Launch: సినీ పరిశ్రమలో ఎవరి జాతకం ఎప్పుడు ఎలా మారుతుందో ఊహించడం కష్టం. ఒకప్పుడు క్లాప్ అసిస్టెంట్‌గా పనిచేసిన వ్యక్తి, రెండు దశాబ్దాల తర్వాత అదే హీరోతో సినిమా నిర్మించే స్థాయికి ఎదగడం నిజంగా ఓ అద్భుతం.
అలాంటి స్ఫూర్తిదాయక ప్రయాణంతో నేచురల్ స్టార్ నాని టాలీవుడ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించారు.
హీరో నితిన్ కథానాయకుడిగా, నాని సమర్పణలో ‘అలియాస్ రుక్మిణీ’ అనే కొత్త చిత్రం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు
Read Also : Rakul Preet Singh : రకుల్ శూర్పణఖ.. అసలు కారణం ఇదేనా..?
‘Alias Rukmini’ Movie Launch: Nani-Nithin Combo Creates a Sensation!
ఈ సినిమా ప్రారంభోత్సవంతో ఒక ఆసక్తికరమైన విషయాన్ని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. సుమారు 21 ఏళ్ల క్రితం (2005లో) దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో నితిన్ హీరోగా వచ్చిన ‘అల్లరి బుల్లోడు’ సినిమాకు నాని క్లాప్ అసిస్టెంట్‌గా పనిచేశారు. అప్పట్లో నితిన్‌పై చిత్రీకరించిన సన్నివేశాలకు క్లాప్ కొట్టిన నాని, ఇప్పుడు అదే నితిన్ సినిమాకు నిర్మాతగా మారి ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టడం విశేషం. ఈ రెండు సందర్భాలకు సంబంధించిన ఫొటోలను పోలుస్తూ.. “ఇదే కదా అసలైన సక్సెస్” అంటూ అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.
Alias Rukmini Movie Launch: అసిస్టెంట్ డైరెక్టర్ నుండి రూ. 100 కోట్ల క్లబ్ స్టార్ వరకు
దర్శకుడు కావాలనే లక్ష్యంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాని ప్రయాణం ఎందరికో ఆదర్శం. లెజెండరీ డైరెక్టర్ బాపు వద్ద ‘రాధా గోపాళం’ చిత్రానికి, ఆ తర్వాత రాఘవేంద్రరావు వద్ద డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశారు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో వచ్చి, ‘అష్టా చమ్మా’ చిత్రంతో అనుకోకుండా హీరోగా మారారు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ, సినిమా సినిమాకు తన నటనను మెరుగుపరుచుకుంటూ ‘పక్కింటి కుర్రాడి’గా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించారు. ఒకప్పుడు మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఉన్న నాని, ఇప్పుడు రూ. 100 కోట్ల మార్కెట్ ఉన్న పాన్-ఇండియా స్థాయి స్టార్‌గా ఎదిగారు.
హీరోగానే కాకుండా నిర్మాతగానూ అభిరుచి గల చిత్రాలను నిర్మిస్తూ నాని మంచి విజయాన్ని అందుకుంటున్నారు. ఒకప్పుడు క్లాప్ అసిస్టెంట్‌గా ఉన్న స్థాయి నుంచి, అదే హీరోతో సినిమా నిర్మించే స్థాయికి ఎదగడం ఆయన పట్టుదలకు, కష్టానికి నిదర్శనం. త్వరలోనే ఆయన మెగాస్టార్ చిరంజీవితోనూ ఓ ప్రాజెక్ట్ చేయనుండటం ఆయన కెరీర్‌లో మరో పెద్ద మైలురాయిగా నిలవనుంది.

