Raaka : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న భారీ ప్రాజెక్ట్ 'రాకా' (Raaka) ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ క్రేజీ సినిమాలో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కూడా ఒక కీలక పాత్రలో నటించబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. అయితే, ఈ వార్తలలో ఎలాంటి వాస్తవం లేదని బాలీవుడ్ వర్గాలు స్పష్టం చేశాయి. ‘జవాన్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత దర్శకుడు అట్లీకి, షారుఖ్ ఖాన్‌కు మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడిన మాట నిజమే అయినప్పటికీ, ‘రాకా’ సినిమా కోసం అట్లీ ఆయనను సంప్రదించలేదని తెలుస్తోంది. కేవలం వీరిద్దరి మధ్య ఉన్న సత్సంబంధాల కారణంగానే ఈ తరహా ఊహాగానాలు పుట్టుకొచ్చాయని, షారుఖ్ ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం లేదని బాలీవుడ్ సమాచారం.
Allu Arjun Raaka Movieభారీ తారాగణంతో పాన్-ఇండియా రేంజ్‌లో రూపుదిద్దుకుంటున్న అట్లీ-బన్నీ ప్రాజెక్ట్
ఈ వదంతులకు చెక్ పడినప్పటికీ, ‘రాకా’ ప్రాజెక్ట్‌పై ఉన్న అంచనాలు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. బన్నీ సరసన బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తుండటంతో ఈ సినిమాపై పాన్-ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ నెలకొంది. భారతీయ చిత్రసీమలోనే అత్యంత ఖరీదైన విజ్యువల్ వండర్‌గా దీనిని తీర్చిదిద్దేందుకు అట్లీ పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నారు. అల్లు అర్జున్ మాస్ ఇమేజ్‌కు, అట్లీ కమర్షియల్ టేకింగ్‌కు దీపికా గ్లామర్ తోడవడంతో ఈ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి గెస్ట్ రోల్స్ లేకపోయినా, ఈ కాంబోనే సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లడానికి సరిపోతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

