Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అల్వాల్‌లో విషాదం.. విద్యుత్ షాక్‌తో తండ్రి, కూతురు దుర్మరణం!

అల్వాల్‌లో విషాదం.. విద్యుత్ షాక్‌తో తండ్రి, కూతురు దుర్మరణం!

వార్త 23 hrs ago

HYD Electric Shock Incident: హైదరాబాద్‌ నగరంలోని అల్వాల్‌ ప్రాంతంలో గుండెల్ని పిండేసే అత్యంత హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా కారుపై పడిన చెట్టు కొమ్మలను తొలగించే ప్రయత్నంలో ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, కూతురు విద్యుత్‌ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయారు.

Read Also : Bengaluru Crime: ఎట్టకేలకు పోలీసులకు దొరికిన దావణగెరెకు చెందిన హంతకురాలు ప్రియాంక

 Tragedy in Alwal: Father and daughter die of electrocution!

HYD Electric Shock Incident: చెట్టు కొమ్మలు తొలగిస్తుండగా ఊహించని ప్రమాదం

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్వాల్‌ పరిధిలో శుక్రవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ వర్షం ధాటికి స్థానిక టెలికాం కాలనీకి చెందిన సందీప్‌ కుటుంబానికి ఉన్న కారుపై ఒక పెద్ద చెట్టు విరిగి పడింది. దీంతో శనివారం ఉదయం కారు దెబ్బతినకుండా దానిపై ఉన్న చెట్టు కొమ్మలను తొలగించేందుకు సందీప్‌, తన కుమార్తె రితికతో కలిసి ప్రయత్నించారు. అయితే, ఆ చెట్టు కొమ్మలు సమీపంలోనే ఉన్న హైటెన్షన్ విద్యుత్‌ తీగలకు తగిలి ఉండటాన్ని వారు గమనించలేదు. కొమ్మలను పట్టుకుని లాగుతున్న క్రమంలో ఒక్కసారిగా విద్యుత్‌ సరఫరా జరిగి తండ్రీకూతురిద్దరూ తీవ్రమైన కరెంట్ షాక్‌కు గురయ్యారు.

అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన తండ్రీకూతురు.. భార్యకు గాయాలు

విద్యుత్ ఘాతానికి గురైన సందీప్, రితిక తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కళ్ల ముందే భర్త, కుమార్తె కరెంట్ షాక్‌తో విలవిలలాడటం చూసి షాక్‌కు గురైన సందీప్‌ భార్య శ్వేత.. వారిని కాపాడేందుకు ఆరాటపడ్డారు. ఈ ప్రయత్నంలో ఆమెకు కూడా విద్యుత్ షాక్ తగిలి స్వల్ప గాయాలయ్యాయి. మృతురాలు రితిక ప్రస్తుతం ఇంటర్మీడియట్‌ చదువుతోంది. చిన్న వయసులోనే రితిక, ఇంటి పెద్ద దిక్కు అయిన సందీప్ ఇద్దరూ ఒకేసారి మరణించడంతో ఆ కుటుంబం రోదనలు మిన్నంటాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న అల్వాల్ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాద తీవ్రతను పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

వామ్మో ..గంటకు 20 మంది రోడ్డు ప్రమాదాలకు బలి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha