Dailyhunt
అమరావతి తీర్మానాన్ని స్వాగతించిన షర్మిల..కానీ ఆ సెక్షన్ సంగతేంటని బాబుకు ప్రశ్న

అమరావతి తీర్మానాన్ని స్వాగతించిన షర్మిల..కానీ ఆ సెక్షన్ సంగతేంటని బాబుకు ప్రశ్న

వార్త 3 weeks ago

YS Sharmila: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా స్వాగతించారు.

విభజన చట్టంలోని సెక్షన్ 5(2)కు సవరణలు కోరుతూ, అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తించాలని కేంద్రాన్ని కోరడం ముందస్తు విజన్‌కు నిదర్శనమని ఆమె కొనియాడారు. భవిష్యత్తులో రాజధాని మార్పు వంటి అనిశ్చితికి తావులేకుండా ఈ చర్య దోహదపడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.

Read Also :Amaravati Capital: అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రానికి ఏపీ అసెంబ్లీ తీర్మానం!

 Assembly Grills Government over Capital Funds

YS Sharmila: విభజన చట్టం సెక్షన్ 94(3) ప్రకారం కేంద్రం నుండి నిధులు హక్కుగా సాధించాలని విన్నపం

అయితే, ఇదే సమయంలో చంద్రబాబు ప్రభుత్వంపై షర్మిల పలు ప్రశ్నలు సంధించారు. రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల విషయంలో విభజన చట్టంలోని సెక్షన్ 94(3) అమలుపై ఆమె నిలదీశారు. అమరావతికి పేరు పెట్టడంలో ఉన్న శ్రద్ధ, కేంద్రం నుండి నిధులు రాబట్టడంలో ఎందుకు లేదని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణ బాధ్యత పూర్తిగా కేంద్రానిదేనని చట్టం చెబుతుంటే, కేవలం అప్పులతో సరిపెట్టుకోవడం ఏంటని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న స్వల్ప నిధులు లేదా అప్పులతో అమరావతి నిర్మాణం సాధ్యం కాదని, సుమారు లక్ష కోట్ల రూపాయల భారాన్ని ప్రజల నెత్తిపై వేయవద్దని షర్మిల డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ గతంలో ఇచ్చిన ‘చెంబుడు నీళ్లు, తట్టెడు మట్టి’తో సంతృప్తి పడదామా అని ఆమె ఎద్దేవా చేశారు. విభజన చట్టం ప్రకారం నిధులు హక్కుగా పొందాలని, దీనిపై కూడా అసెంబ్లీలో తీర్మానం చేయాలని కూటమి ప్రభుత్వానికి ఆమె సూచించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఆర్టీసీ బస్సును ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha