Amaravati Central Secretariat: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది.
అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఇటీవల రూ. 2,534 కోట్లను భారీగా కేటాయించింది. ఈ నిధులతో సెంట్రల్ సెక్రటేరియట్తో పాటు, అక్కడ పనిచేసే ఉద్యోగుల కోసం నివాస క్వార్టర్స్ నిర్మించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల డిజైన్, నిర్మాణ బాధ్యతలను సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ పర్యవేక్షించనుంది. రాజధాని కోర్ ఏరియాలో భూముల అప్పగింత ప్రక్రియ కూడా అతి త్వరలోనే పూర్తి కానుంది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఇక్కడ శాశ్వతంగా ఏర్పాటు కావడం వల్ల అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరిగి, అమరావతి ఒక శక్తివంతమైన పరిపాలనా కేంద్రంగా మారబోతోంది.
ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించిన కేటాయింపుల వివరాలు, సెంట్రల్ సెక్రటేరియట్ రూ. 1,600 కోట్లు , GPRA హౌసింగ్రూ. 934 కోట్లు తో నిర్మించనున్నారు. ఈ పనులన్నీ అనుకున్న సమయానికి సజావుగా సాగేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సంస్థలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటోంది. నిర్మాణ ప్రాంతాలకు అవసరమైన నీరు, విద్యుత్ సరఫరాకు సంబంధించిన అనుమతులు కూడా వేగంగా లభిస్తున్నాయి.
Read also: Kutami Govt : కూటమికి రెండేళ్లు.. నేడు తిరుపతి లో 'సంక్షేమం' పేరిట సభ
Massive funds for Amaravati… New projects worth ₹2,534 crore set to launch!
Amaravati Central Secretariat: రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త ఊపు..
అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ ఏర్పాటు కానుందనే వార్తతో స్థానిక రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త ఉత్సాహం నెలకొంది. రాయపూడి వంటి గ్రామాల్లో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు ఇప్పటికే భారీగా ఊపందుకున్నాయి. క్షేత్రస్థాయిలో పనులు మొదలవ్వగానే ఇక్కడి భూముల ధరలు మరింత ఆకాశాన్ని తాకే అవకాశాలున్నాయి అని అంచనా వేస్తున్నారు.ఇళ్లకు డిమాండ్ భారీగా పెరుగుతుంది. భవిష్యత్తులో అద్దెలు, పెట్టుబడి విలువ పెరుగుతుందనే ఆశతో ఇన్వెస్టర్లు ఇప్పుడే ప్లాట్లు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఐటీ రంగానికి కొత్త ద్వారాలు
ఈ మెగా ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయి రోడ్లు, అండర్ గ్రౌండ్ విద్యుత్ వ్యవస్థలు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలు అద్భుతంగా మెరుగుపడనున్నాయి. ఈ సౌకర్యాల వల్ల చుట్టుపక్కల గ్రామాలు, కొత్తగా వచ్చే నివాస ప్రాంతాలకు కూడా ఎంతో మేలు జరుగుతుంది. భవిష్యత్తులో అమరావతిలో ఐటీ రంగం విస్తరించడానికి, కొత్త పరిశ్రమలు రావడానికి ఎంతో దోహదపడతాయి. స్థానిక కార్మికులు, కాంట్రాక్టర్లకు కూడా ఈ నిర్మాణాల ద్వారా వేల సంఖ్యలో ఉపాధి లభించనుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read also Epaper: epaper.vaartha.com
Read also:
ఓలా డ్రైవర్ నిర్వాకం: జడ్జి ఎగ్జామ్ టైంలో నడిరోడ్డుపై వదిలేశాడు.. చివరికి కోర్టు ఏం చెప్పింది ?

