Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనితపై వైఎస్సార్‌సీపీ (YSRCP) నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు.
రాజకీయాల్లో విమర్శలు ఎప్పుడైనా విధానపరంగానే ఉండాలి తప్ప, వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదని ఆయన హితవు పలికారు. మహిళలను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న ఇలాంటి వ్యాఖ్యలను సమాజం అంగీకరించబోదని స్పష్టం చేశారు.
Read Also : AP Weather update: నేడు ఏపీకి భారీ వర్ష సూచన
Pawan Kalyan takes a serious view of Amarnath!
Deputy CM Pawan Kalyan: మహిళల కట్టూబొట్టుపై మాట్లాడటం దిగజారుడు రాజకీయమే..
కూటమి నాయకులతో జరిగిన అంతర్గత సమావేశంలో పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని తీవ్రంగా ఖండించారు. “రాజకీయాల్లో ప్రజా సమస్యలపై మాట్లాడాలి. కానీ, మహిళల కట్టూబొట్టుపై, వారి వ్యక్తిగత విషయాలపై కామెంట్స్ చేసే స్థాయికి ఆ నాయకుడి (అమర్నాథ్) పార్టీ వారు దిగజారిపోయారు” అని మండిపడ్డారు. ఇటువంటి సంస్కృతి రాజకీయాలకు ఏమాత్రం శ్రేయస్కరం కాదని ఉపముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు కేవలం హోంమంత్రి అనితను మాత్రమే ఉద్దేశించినవి కావని, అవి సగటు మహిళలందరినీ కించపరిచేలా ఉన్నాయని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా నేతలపై ప్రతిపక్షాలు చేస్తున్న ఇటువంటి దాడులను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. స్త్రీలపై అవతలి పార్టీ వాళ్లు చేసిన కామెంట్స్‌లో ఎంతటి అభ్యంతరకర విషయం ఉందో, వారి ఆలోచనా విధానం ఎలా ఉందో ప్రజలకు స్పష్టంగా వివరించాలని కూటమి (TDP-JSP-BJP) నేతలకు సూచించారు.
అసలేం జరిగిందంటే..?
ఇటీవల లా అండ్ ఆర్డర్, శాంతిభద్రతల విషయంలో హోంమంత్రి అనితను విమర్శించే క్రమంలో.. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆమెపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. హోంమంత్రికి రాష్ట్రంలో శాంతిభద్రతల కంటే తన ‘మేకప్’ పైనే శ్రద్ధ ఎక్కువ ఉందంటూ ఆయన చేసిన కామెంట్లు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. దీనిపైనే తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గట్టి కౌంటర్ ఇచ్చారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

