Srikakulam News: భారత రాజ్యాంగ నిర్మాత, మహనీయుడు డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఆశయ సాధనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
శ్రీకాకుళంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో మంగళవారం నిర్వహించిన అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
Read also: West Bengal Elections 2026: బెంగాల్ ఓటర్ల జాబితాపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

Minister Atchennaidu at Ambedkar event
Srikakulam News: చదువుతోనే ఏదైనా సాధ్యమని నిరూపించారు
ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ అంబేద్కర్ కేవలం ఒక వ్యక్తి కాదని, అణగారిన వర్గాల తలరాతను మార్చిన మహాశక్తి అని కొనియాడారు. పేద దళిత కుటుంబం నుంచి వచ్చిన ఆయన, చదువుతోనే ఏదైనా సాధ్యమని నిరూపించారన్నారు. అందుకే ఎన్టీ రామారావు హయాంలో ఎస్సీ, బీసీ వర్గాల కోసం పెద్ద సంఖ్యలో రెసిడెన్షియల్ పాఠశాలలు స్థాపించి విద్యా విప్లవానికి నాంది పలికారని గుర్తు చేశారు.
మహిళా హక్కులు, రిజర్వేషన్లు
మహిళా హక్కుల కోసం అంబేద్కర్ ఆనాడే రాజ్యాంగంలో రక్షణలు కల్పించారని, దానికి కొనసాగింపుగా త్వరలోనే చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం కొత్త అధ్యాయాన్ని సృష్టించబోతోందని తెలిపారు. జిల్లాలోని సంజీవయ్య పార్కును సుందరంగా తీర్చిదిద్దుతామని, హాస్టల్ పాఠశాలల్లో పాఠ మోలిక వసతులు, స్వచ్ఛమైన మంచినీరు అందించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
చిత్తశుద్ధితో అమలు చేసినప్పుడే పూర్తిస్థాయి మేలు
జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ రాజ్యాంగం మనకు ఎన్ని గొప్ప హక్కులు కల్పించినా, వాటిని అధికారులు, పాలకులు చిత్తశుద్ధితో అమలు చేసినప్పుడే ప్రజలకు పూర్తిస్థాయిలో మేలు జరుగుతుందని అంబేద్కర్ ఆనాడే చెప్పారని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా అనేక హాస్టళ్లు, గురుకుల పాఠశాలలను నిర్వహిస్తూ పేదలకు అండగా నిలుస్తోందని ఆయన వివరించారు.
వివక్ష లేని సమాజ నిర్మాణమే నిజమైన నివాళి
జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరి రెడ్డి మాట్లాడుతూ విద్యతోనే ఆత్మాభిమానం, వ్యక్తి వికాసం సాధ్యమని, ఎదుట వ్యక్తి ఆలోచనలు గౌరవించి, అటువంటి ఆలోచనలు ఆచరణలో పెట్టి వివక్ష లేని సమాజాన్ని నిర్మించడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని ఎస్పీ పేర్కొన్నారు.
ఎన్టీఆర్ హయాంలోనే అంబేద్కర్ కు భారతరత్న
శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్న కాలంలోనే అంబేద్కర్కు ‘భారతరత్న’ దక్కిందని, ఆయన స్ఫూర్తితోనే మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్ దేనని అన్నారు. జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తిని సమానంగా గౌరవించాలని కోరారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

