Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమెజాన్ ప్రైమ్‌కు షాక్: ఫెడరల్ కోర్టులో దావా వేసిన ఆస్ట్రేలియా ప్రభుత్వం

అమెజాన్ ప్రైమ్‌కు షాక్: ఫెడరల్ కోర్టులో దావా వేసిన ఆస్ట్రేలియా ప్రభుత్వం

వార్త 1 day ago

Amazon Prime: ప్రముఖ ఓటీటీ (OTT) దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఆస్ట్రేలియాలో చట్టపరమైన ఇబ్బందుల్లో పడింది. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిందనే ఆరోపణలపై ఆస్ట్రేలియా కాంపిటీషన్‌ అండ్‌ కన్జ్యూమర్‌ కమిషన్‌ (ACCC) సదరు సంస్థపై అక్కడి ఫెడరల్ కోర్టులో దావా వేసింది.

వినియోగదారులకు ఎలాంటి ముందస్తు సమాచారం లేదా స్పష్టత ఇవ్వకుండానే స్ట్రీమింగ్ మధ్యలో వాణిజ్య ప్రకటనలను (Ads) ప్రవేశపెట్టడంపై కమిషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

Amazon Prime: అదనపు వసూళ్లు.. 10 లక్షల మంది సబ్‌స్క్రైబర్లపై ప్రభావం

కమిషన్ కోర్టుకు సమర్పించిన వివరాల ప్రకారం.. ప్రైమ్ వీడియోలో ప్రకటనలు లేకుండా కంటెంట్ చూడాలనుకునే వారి నుంచి కంపెనీ అదనపు రుసుమును వసూలు చేయడం ప్రారంభించింది.

“నవంబర్ 2023 నుంచి ఆగస్టు 2025 మధ్య కాలంలో అమెజాన్ అవలంబించిన ఈ విధానాల వల్ల దాదాపు 10 లక్షల మంది ఆస్ట్రేలియా సబ్‌స్క్రైబర్లు నష్టపోయారు. వినియోగదారుల హక్కులను కాలరాసినందుకు గానూ వారికి తగిన నష్టపరిహారం చెల్లించాలి.” - ఆస్ట్రేలియా కన్జ్యూమర్ కమిషన్ (ACCC)

చట్టాలను ఉల్లంఘించి కస్టమర్లను ఇబ్బంది పెట్టిన అమెజాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే ప్రభావితమైన చందాదారులందరికీ జరిమానాతో కూడిన పరిహారం ఇప్పించాలని కమిషన్ కోర్టును కోరింది. ఈ పరిణామం ఇప్పుడు అంతర్జాతీయ టెక్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Epaper: epaper.vaartha.com

వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌లో అంతర్నిర్మిత భద్రతా చర్యలు ఉన్నాయి: మెటా స్పందన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha