Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమెజాన్ ప్రైమ్‌లో 'కరికాడ' మూవీ రివ్యూ!

అమెజాన్ ప్రైమ్‌లో 'కరికాడ' మూవీ రివ్యూ!

వార్త 3 weeks ago

Karikaada Movie: కన్నడ చిత్ర పరిశ్రమలో ఇటీవల కాలంలో వినూత్నమైన కథాంశాలతో వస్తున్న సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆ కోవకు చెందినదే కన్నడ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'కరికాడ'.

నటరాజ్ హీరోగా ఆయన సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకు వెంకటేశ్ దర్శకత్వం వహించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 6వ తేదీన థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌పైకి వచ్చేసింది. ఈ నెల 29వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ ‘అమెజాన్ ప్రైమ్’ లో ఈ సినిమా సైలెంట్‌గా స్ట్రీమింగ్ అవుతోంది. కన్నడతో పాటు తెలుగు ఆడియన్స్‌ కోసం తెలుగు ఆడియోలోనూ ఇది అందుబాటులోకి వచ్చింది.

Read Also: Pooja Hegde Selfie Controversy: సెల్ఫీ వివాదంపై స్పందించిన పూజా హెగ్డే

 ‘Karikada’ movie: Karikaada Movie review on Amazon Prime!

కథ

అది అడవిని ఆనుకుని ఉన్న ఒక మారుమూల గ్రామం. ఆ గ్రామానికి ఓ మోతుబరి రైతు భూపతి (బల్ రాజ్) ప్రెసిడెంట్ గా ఉంటాడు. అతనికి మల్లి (యశ్ శెట్టి), కాంత (విపిన్ ప్రకాశ్) అనే ఇద్దరు కొడుకులు ఉంటారు. ప్రెసిడెంట్ మేనకోడలు కనక (నిరీక్ష శెట్టి) ఆ ఇంట్లోనే పెరుగుతుంది. కనక పేరుతో కొంత భూమి ఉండటం వలన, ఆ ఆస్తి ఎటూ పోకుండా తన చిన్న కొడుకు కాంతకి ఇచ్చి పెళ్లి చేయాలని భూపతి నిర్ణయించుకుంటాడు.

కానీ, కనక మాత్రం అడవి పందులను వేటాడే పేద యువకుడు ‘కాడ’ (నటరాజ్)ను ఇష్టపడుతుంది. కనక మనసులో ఏముందో ప్రెసిడెంట్ భూపతికి అర్థమైపోతుంది. తన మేనకోడలు గనుక కాడను పెళ్లి చేసుకుంటే కుటుంబ పరువు పోవడంతో పాటు ఆస్తి కూడా చేజారిపోతుందని భూపతి భావిస్తాడు. అందుకోసం కాడను అడ్డు తొలగించుకోవాలని తన కొడుకులను రంగంలోకి దింపుతాడు. ఆ తర్వాత కాడకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? భూమి కోసం, స్త్రీ కోసం అతను ఎలా పోరాడాడు? అనేదే మిగతా సినిమా కథ.

కథ నేపథ్యం

అడవి నేపథ్యంలో సాగే ఈ కథలో ఒక అందమైన ప్రేమకథ కూడా భాగం కావడంతో, ఆడియన్స్ ఈ సినిమా నుంచి లవ్ అండ్ రొమాన్స్ ఆశిస్తారు. హీరోయిన్ వర్షంలో, రాత్రివేళల్లో హీరోను కలుసుకునే సన్నివేశాలు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. కానీ హీరో మాత్రం ఆమె పట్ల తనకేమీ ఫీలింగ్స్ లేవని కసురుకుంటూ ఆడియన్స్‌ను కాస్త నిరుత్సాహపరుస్తాడు. హీరో-హీరోయిన్ల మధ్య రొమాన్స్ ఉంచే అవకాశం ఉన్నా దర్శకుడు దాన్ని వాడుకోకపోవడం సినిమాకు ప్రధాన లోపంగా అనిపిస్తుంది.

అయితే, హీరో అడవి పందులను వేటాడే సన్నివేశాలు, శత్రువుల బారి నుంచి తప్పించుకునే యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా, గ్రిప్పింగ్‌గా సాగుతాయి. ఈ కథను చెప్పడానికి దర్శకుడు ఎంచుకున్న అడవి లొకేషన్స్ సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచి ఎక్కువ మార్కులు కొట్టేస్తాయి. సినిమాలో అక్కడక్కడా కొన్ని అనవసరమైన సన్నివేశాలు ఉన్నప్పటికీ, ఎడిటింగ్ వైపు నుంచి కొన్ని సీన్లు ట్రిమ్ చేయాల్సి ఉన్నా.. సినిమా క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ మాత్రం ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. ఈ ఒక్క ట్విస్ట్ ప్రేక్షకుడిని మంచి థ్రిల్‌కు గురిచేస్తుంది.

ముగింపు

సినిమా ఆరంభంలోనూ, క్లైమాక్స్ లోనూ జోడించిన ఒక అదనపు అంశం సామాన్య ప్రేక్షకుడిని కొంత అయోమయానికి గురిచేసినప్పటికీ, ఓవరాల్‌గా ఇదొక మంచి రా యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పవచ్చు. కెమెరా పనితనం, నేపథ్య సంగీతం (BGM) సినిమా మూడ్‌కు తగ్గట్టుగా ఫరవాలేదనిపిస్తాయి. కన్నడ నేటివిటీతో కూడిన భిన్నమైన యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారు ఈ వారాంతంలో అమెజాన్ ప్రైమ్‌లో ‘కరికాడ’ చిత్రాన్ని తెలుగులో వీక్షించవచ్చు.

సందీప్ కిషన్ 'సిగ్మా' సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha