Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమెజాన్‌లో రాఖీ ఆఫర్స్.. 70% వరకు భారీ డిస్కౌంట్లు

అమెజాన్‌లో రాఖీ ఆఫర్స్.. 70% వరకు భారీ డిస్కౌంట్లు

వార్త 0 months ago

Amazon Rakhi Sale: రాఖీ పౌర్ణిమ పండుగను పురస్కరించుకుని ప్రముఖ ఈ-కామర్స్ వేదిక అమెజాన్ వినియోగదారుల కోసం అదిరిపోయే ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది.

ఫ్యాషన్, బ్యూటీ, హోమ్ అండ్ కిచెన్, ఎలక్ట్రానిక్స్ వంటి ప్రముఖ విభాగాల్లోని వివిధ టాప్ బ్రాండ్ల ఉత్పత్తులపై ఏకంగా 70 శాతం వరకు డిస్కౌంట్లు అందిస్తున్నట్లు ప్రకటించింది.

ప్రముఖ బ్రాండ్లపై ఆఫర్ల వర్తింపు

ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా వినియోగదారులు అనేక మార్కెట్ లీడింగ్ బ్రాండ్ల ఉత్పత్తులను భారీ తగ్గింపు ధరలతో కొనుగోలు చేయవచ్చు. బిబా (Biba), లిబాస్ (Libas), మాన్యవర్ (Manyavar) వంటి ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్లతో పాటు, శామ్‌సంగ్ (Samsung), ఎల్జీ (LG), సోనీ (Sony) వంటి ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్లపై కూడా ఈ ఆఫర్లు వర్తిస్తాయని అమెజాన్ వెల్లడించింది.

Amazon Rakhi Sale: ప్రైమ్ సభ్యులకు ప్రత్యేక అదనపు ప్రయోజనాలు

అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ కలిగి ఉన్న వినియోగదారులకు ఈ సేల్‌లో మరింత ఎక్కువ ప్రయోజనాలు లభించనున్నాయి. ప్రైమ్ సభ్యులకు సాధారణ డిస్కౌంట్‌లతో పాటు అదనంగా మరో 5 శాతం తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా, పండుగ వేళ బహుమతులు సకాలంలో అందేలా వేగవంతమైన (ఫాస్ట్) డెలివరీ సౌకర్యాన్ని కూడా అమెజాన్ కల్పిస్తోంది.

తక్కువ ధరలోనే రాఖీలు, స్వీట్లు, బహుమతులు

ఈ పండుగ సీజన్ కోసం ప్రత్యేకంగా కేవలం రూ.19 ల ప్రారంభ ధర నుంచే లభించే 500 రకాలకు పైగా రాఖీలను అందుబాటులో ఉంచారు. వీటిని ‘అమెజాన్ నౌ’ ద్వారా మరింత వేగంగా డెలివరీ చేస్తున్నారు. అలాగే, సోదరీసోదరుల కోసం ప్రత్యేకంగా స్వీట్లు మరియు ఆకర్షణీయమైన బహుమతుల ధరలు కేవలం రూ.99 నుంచే ప్రారంభమవుతున్నాయని అమెజాన్ తెలిపింది.

చెక్ బుక్స్ లో కీలక మార్పులు.. మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్తగా సెక్యూరిటీ కోడ్..!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha