Dailyhunt
అమెరికా 250 ఏళ్ల వేడుకలు: ట్రంప్ ఫొటోతో ప్రత్యేక పాస్‌పోర్ట్‌

అమెరికా 250 ఏళ్ల వేడుకలు: ట్రంప్ ఫొటోతో ప్రత్యేక పాస్‌పోర్ట్‌

వార్త 1 week ago

మెరికా చరిత్రలో ఇది ఒక అరుదైన ఘట్టం. సాధారణంగా చారిత్రక కట్టడాలు లేదా దివంగత నేతల చిత్రాలు ఉండే పాస్‌పోర్ట్‌లపై, తొలిసారిగా పదవిలో ఉన్న అధ్యక్షుడి చిత్రం ముద్రించబోతున్నారు.

అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల (Semiquincentennial) జ్ఞాపకార్థం ఈ స్మారక పాస్‌పోర్ట్‌లను రూపొందించారు. పాస్‌పోర్ట్ లోపలి పేజీలో డొనాల్డ్ ట్రంప్ చిత్రం, ఆయన సంతకం బంగారు వర్ణంలో మెరుస్తూ కనిపిస్తాయి. సాధారణ పాస్‌పోర్ట్‌లతో పోలిస్తే, దీనిపై ‘United States of America’ , ‘Passport’ అనే అక్షరాల అమెరికాలో మార్పులు చేశారు. వెనుక భాగంలో ‘250’ సంఖ్యతో కూడిన అమెరికా జెండా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

Read Also: Iran-America War: ఇరాన్ ప్రతిపాదనలు - అమెరికా తిరస్కరణ: కొనసాగుతున్న ప్రతిష్టంభన

 Trump Photo

Trump Photo: పరిమిత సంఖ్యలో లభ్యత

ఈ ప్రత్యేక పాస్‌పోర్ట్‌లు అందరికీ అందుబాటులో ఉండవు. వాషింగ్టన్ డీసీలోని పాస్‌పోర్ట్ కార్యాలయంలో నేరుగా దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే ఇవి లభిస్తాయి. జూలై 4వ తేదీ నాటికి సుమారు 25,000 నుంచి 30,000 వరకు పాస్‌పోర్ట్‌లను సిద్ధం చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని కోసం అదనపు రుసుము ఏమీ వసూలు చేయకపోవడం గమనార్హం. పాస్‌పోర్ట్ రూపకల్పన మారినప్పటికీ, అందులోని భద్రతా ఫీచర్లు మాత్రం అత్యంత ఆధునికంగా ఉంటాయని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. బయోమెట్రిక్ డేటా, వాటర్ మార్క్స్ వంటివి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగానే ఉంటాయి. కేవలం పాస్‌పోర్ట్‌లే కాకుండా, ట్రంప్ పేరును చిరస్థాయిగా నిలిపేలా మరికొన్ని చర్యలు కూడా సాగుతున్నాయి. కరెన్సీ నోట్లు: అమెరికా కరెన్సీపై సంతకం చేయబోతున్న తొలి అధ్యక్షుడిగా ట్రంప్ రికార్డ్ సృష్టించనున్నారు. 250 ఏళ్ల వేడుకల గుర్తుగా ట్రంప్ ముఖచిత్రంతో కాయిన్స్‌ను కూడా విడుదల చేయనున్నారు. వాషింగ్టన్ డీసీలోని కీలక భవనాలకు ట్రంప్ పేరును అనుసంధానించే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి.

    Read Also hindi news: hindi.vaartha.com

    Read Also Epaper : epaper.vaartha.com

    Read Also :

    అమ్మలేని చమురు ఇరాన్ కు కొత్త సమస్య ఎందుకు

    Dailyhunt
    Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha