US Economic Warfare Iran : ఇరాన్‌పై అమెరికా ప్రభుత్వం విధించిన సరికొత్త ఆర్థిక, వాణిజ్య ఆంక్షలపై టెహ్రాన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ఈ ఆంక్షలను కేవలం సాధారణ ఒత్తిడి చర్యలుగా కాకుండా, ఇరాన్ ప్రజల ప్రాథమిక హక్కులను హరించే 'ఆర్థిక ఉగ్రవాదం' (Economic Terrorism) మరియు మానవాళికి వ్యతిరేకంగా చేసిన నేరాలుగా ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అభివర్ణించింది.
అమెరికా అనుసరిస్తున్న ఈ దుందుడుకు ధోరణి యుద్ధానికి మరో రూపమని హెచ్చరించింది.
Read Also: Iran: ట్రంప్ హెచ్చరికలపై ఘాటుగా స్పందించిన ఇరాన్
US Economic Warfare Iran
US Economic Warfare Iran : చారిత్రక శత్రుత్వం & 1953 సైనిక తిరుగుబాటు ప్రస్తావన
1953లో ఇరాన్ (Iran) లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోయడానికి అమెరికా పన్నిన కుట్ర (ఆగస్టు 19) గుర్తుకొచ్చే రోజే ఈ ఆంక్షలు అమలులోకి రావడం యాదృచ్ఛికం కాదని ఇరాన్ పేర్కొంది. ఇది గత 73 సంవత్సరాలుగా ఇరాన్ ప్రజలపై అమెరికా చూపుతున్న శత్రుత్వానికి, అహంకారపూరిత విధానాలకు సజీవ సాక్ష్యమని విమర్శించింది. ఏకపక్ష ఆంక్షల ద్వారా ఇరాన్ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయడం అమెరికా వల్ల కాదని స్పష్టం చేసింది.
అమెరికా ఆర్థిక సంక్షోభం నుంచి దృష్టి మళ్లించే నాటకం
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘీ మాట్లాడుతూ, అమెరికా డొమెస్టిక్ లెవెల్లో ఎదుర్కొంటున్న తీవ్రమైన అప్పుల భారం, ఆర్థిక సంక్షోభం నుంచి ప్రపంచ దృష్టిని మళ్లించేందుకే ఈ 'ఎకనామిక్ డీ-డే' (Economic D-Day) నాటకాలు ఆడుతోందని ఎద్దేవా చేశారు. గత ఏడాదిన్నరగా ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై చేసిన ఆక్రమణ యత్నాలు విఫలమవ్వడంతోనే అమెరికా ఈ రకమైన ఒత్తిడి మళ్లీ ప్రారంభించిందని ఆయన ఆరోపించారు. ఈ తాజా ఆంక్షలతో ప్రపంచ ఇంధన రవాణాకు జీవనాడి లాంటి హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తమపై ఉన్న ఆంక్షలు పూర్తిగా తొలగించి, స్తంభింపజేసిన ఆస్తులను విడుదల చేసే వరకు హర్మూజ్ జలసంధి గుండా నౌకల రవాణాను అనుమతించేది లేదని మొహమ్మద్ బాఘర్ గాలిబాఫ్ స్పష్టం చేశారు.
Epaper: epaper.vaartha.com

