Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమెరికా భద్రతా సలహాదారు డీజే అవతారం.. నైట్ క్లబ్‌లో మార్కో రుబియో!

అమెరికా భద్రతా సలహాదారు డీజే అవతారం.. నైట్ క్లబ్‌లో మార్కో రుబియో!

వార్త 1 month ago

Marco Rubio DJ Video: సాధారణంగా అమెరికా విదేశాంగ విధానాలు, జాతీయ భద్రత వంటి గంభీరమైన అంశాలపై చర్చించే మార్కో రుబియో, తాజాగా పూర్తిగా భిన్నమైన రూపంలో కనిపించారు.

మియామిలోని ఒక ప్రముఖ నైట్ క్లబ్‌లో జరిగిన వివాహ వేడుకకు హాజరైన ఆయన, అనూహ్యంగా డీజే కన్సోల్ ముందుకు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.ట్రంప్ సన్నిహితుడు డాన్ స్కావినో షేర్ చేసిన ఈ వీడియోలో రుబియో ప్రొఫెషనల్ డీజే తరహాలో హెడ్‌ఫోన్‌లు పెట్టుకుని కనిపించారు.

Read Also:China cat death: పిల్లి చావుకు భారీ మూల్యం.. ఆస్పత్రికి రూ. 35 లక్షల జరిమానా

Marco Rubio DJ Video: డీజే కన్సోల్ వద్ద రుబియో మ్యాజిక్

పాటలను మిక్స్ చేస్తూ, బీట్‌లకు అనుగుణంగా అతిథులను ఉత్సాహపరచడం చూసి అక్కడి వారంతా ఆశ్చర్యపోయారు. కేవలం మ్యూజిక్ ప్లే చేయడమే కాకుండా, స్వయంగా డ్యాన్స్ ఫ్లోర్‌పైకి వచ్చి గెస్టులతో కలిసి స్టెప్పులు వేయడం ఆ వేడుకలో హైలైట్‌గా నిలిచింది.అధికారిక సమావేశాల్లో ఎప్పుడూ సూటు, బూటుతో గంభీరంగా ఉండే రుబియో,

ఇలా షర్ట్ ఫోల్డ్ చేసుకుని డీజేగా మారడంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “రుబియోలో ఈ యాంగిల్ కూడా ఉందా!” అంటూ కామెంట్లు పెడుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌లో అత్యంత కీలక బాధ్యతలు చేపట్టబోతున్న వ్యక్తి ఇలా సరదాగా కనిపించడం చర్చనీయాంశమైంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

సంబంధాల పునరుద్ధరణకు మార్కో రూబియో రోమ్ పర్యటన!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha