అంతర్జాతీయ వ్యాపార రంగంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో సంచలనాలు సృష్టిస్తున్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో గత వారం జరిగిన కీలక సమావేశాల తర్వాత, వైట్ హౌస్ ఒక కీలకమైన ప్రకటనను విడుదల చేసింది.
దీని ప్రకారం, అమెరికా నుంచి ఏటా కనీసం 17 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 1.4 లక్షల కోట్లు) విలువైన వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు చైనా అంగీకరించింది. 2026, 2027, 2028 సంవత్సరాల్లో ఈ కొనుగోళ్లు నిరంతరాయంగా సాగుతాయని వైట్ హౌస్ తన నివేదికలో స్పష్టం చేసింది. అయితే, గత ఏడాది అక్టోబర్ 2025లో సోయాబీన్ కొనుగోలు కోసం చైనా చేసుకున్న ఒప్పందాలు దీనికి అదనం కావడం విశేషం. చికెన్, బీఫ్ దిగుమతులపై ఆంక్షల సడలింపు గత కొంతకాలంగా ఇరు దేశాల మధ్య నడుస్తున్న ట్రేడ్ వార్ (వాణిజ్య యుద్ధం) కారణంగా అమెరికా రైతులు తీవ్రంగా నష్టపోయారు.
Read Also: Bangkok : బస్సును ఢీకొట్టిన రైలు.. !!
America-China Deal
America-China Deal: యూఎస్-చైనా ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్
ఒకరిపై ఒకరు భారీగా టారిఫ్‌లు (పన్నులు) విధించుకోవడంతో, అమెరికా నుంచి చైనాకు జరిగే వ్యవసాయ ఎగుమతులు 2025 నాటికి 65.7 శాతం పడిపోయి, కేవలం 8.4 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ట్రంప్ తన మొదటి విడత అధ్యక్ష కాలంలో చూపించిన దూకుడు వల్ల, చైనా అమెరికా ఉత్పత్తులపై ఆధారపడటం బాగా తగ్గించేసింది. ఉదాహరణకు 2016లో చైనా తన సోయాబీన్ అవసరాల కోసం 41 శాతం అమెరికాపై ఆధారపడితే, 2024 నాటికి అది 20 శాతానికి పడిపోయింది. కానీ ఇప్పుడు ట్రంప్ మళ్లీ పట్టుబట్టడంతో, చైనా ఒకడుగు వెనక్కి వేసింది. అమెరికా బీఫ్ (గోమాంసం) కంపెనీలపై ఉన్న సస్పెన్షన్లను ఎత్తివేయడానికి, అలాగే బర్డ్ ఫ్లూ లేని అమెరికా రాష్ట్రాల నుంచి చికెన్ (కోడిమాంసం) దిగుమతులను మళ్లీ ప్రారంభించడానికి చైనా అధికారులు అంగీకరించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
ట్రంప్ టారిఫ్ రీయింబర్స్మెంట్ల వివాదం: అమెజాన్‌పై వినియోగదారుల దావా!

