US Iran Peace Talks: అంతర్జాతీయ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు ఇరు దేశాల కఠిన షరతులతో తీవ్ర ఉత్కంఠగా మారాయి.
ఇరాన్‌కు జరిగిన ఎటువంటి నష్టాలకూ పరిహారం చెల్లించే ప్రసక్తి లేదని అమెరికా తెల్చి చెప్పడంతో పాటు ఐదు కఠినమైన డిమాండ్లను తెరపైకి తెచ్చింది. ఈ మేరకు ఇరాన్‌కు చెందిన ప్రముఖ 'ఫార్స్ న్యూస్ ఏజెన్సీ' (Fars News Agency) ఒక ప్రత్యేక నివేదికను విడుదల చేసింది.
Read also: Hamas Commander Killed: ఇజ్రాయెల్ వ్యూహాత్మక దాడి.. హమాస్ మిలిటరీ విభాగం అధిపతి హద్దాద్ దుర్మరణం!
ఇరాన్‌తో జరుగుతున్న శాంతి చర్చల్లో అమెరికా అత్యంత కఠినమైన ఐదు షరతులను విధించింది. ఇప్పటి వరకు ఇరాన్‌కు జరిగిన నష్టాలకు ఎలాంటి పరిహారం చెల్లించే ప్రసక్తి లేదని అమెరికా గట్టిగా తేల్చి చెప్పినట్లు ఇరాన్‌కు చెందిన ఫార్స్ న్యూస్ ఏజెన్సీ తన నివేదికలో వెల్లడించింది. ఇందులో భాగంగా ఇరాన్ తన వద్ద ఉన్న 400 కిలోల శుద్ధిచేసిన యురేనియంను తమకు అప్పగించాలని అమెరికా డిమాండ్ చేసింది. అలాగే ఇరాన్‌లోని అణు కేంద్రాల్లో కేవలం ఒక్కదానికి మాత్రమే అనుమతి ఇస్తామని పేర్కొంటూ, విదేశాల్లో స్తంభించిపోయిన ఇరాన్ ఆస్తుల్లో కనీసం 25 శాతాన్ని కూడా విడుదల చేయబోమని స్పష్టం చేసింది. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఘర్షణల ముగింపు అనేది ఈ చర్చల పురోగతిపైనే ఆధారపడి ఉంటుందని అమెరికా కొత్త లింక్ పెట్టింది.
Iranian nuclear facility map highlighted during the ongoing geopolitical dispute over uranium enrichment
ఈ ఐదు షరతులకు ఒకవేళ ఇరాన్ అంగీకరించినప్పటికీ అమెరికా, ఇజ్రాయెల్(US Iran Peace Talks) దేశాల నుంచి దానికి ఎదురయ్యే ముప్పు అలాగే కొనసాగుతుందని వైనెట్ న్యూస్ అభిప్రాయపడింది. మరోవైపు అమెరికా వైఖరికి భిన్నంగా ఇరాన్ కూడా చర్చల కోసం తన వైపు నుండి ఐదు షరతులను తెరపైకి తెచ్చింది. ముఖ్యంగా లెబనాన్‌లో జరుగుతున్న ఘర్షణలను తక్షణమే ఆపాలని, తమపై ఉన్న అంతర్జాతీయ ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని, విదేశాల్లో స్తంభించిన తమ నిధులను విడుదల చేయాలని ఇరాన్ కోరింది. వీటితో పాటు యుద్ధ నష్టపరిహారం చెల్లించడంతో పాటు వ్యూహాత్మక హర్మూజ్ జలసంధిపై తమ సార్వభౌమాధికారాన్ని గుర్తించాలని ఇరాన్ గట్టిగా డిమాండ్ చేసింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

