Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందం.. హర్షం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ!

అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందం.. హర్షం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ!

వార్త 2 weeks ago

PM Modi on US-Iran Peace Agreement: పశ్చిమాసియా (Middle East) ప్రాంతంలో గత కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరదించుతూ.. ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన చారిత్రక శాంతి ఒప్పందాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) మనస్ఫూర్తిగా స్వాగతించారు.

ఈ దౌత్యపరమైన అంగీకారం కేవలం పశ్చిమాసియాకే పరిమితం కాకుండా, ప్రపంచ దేశాల ఆర్థిక స్థిరత్వానికి సైతం ఎంతో కీలకమని ప్రధాని అభిప్రాయపడ్డారు.

Read Also :Peace Agreement : అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం..లెబనాన్ పై వెనక్కి తగ్గని నెతన్యాహు

ఆర్థిక అంతరాయాలు, ప్రాణనష్టానికి చెక్ - పీఎం మోదీ ట్వీట్

పశ్చిమాసియాలో చోటుచేసుకున్న ఈ శాంతి పరిణామాలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య సాగిన సుదీర్ఘ సంఘర్షణ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆర్థిక అంతరాయాలకు, సరఫరా గొలుసు (Supply Chain) దెబ్బతినడానికి కారణమైందని, అలాగే ఎంతోమంది అమాయకుల ప్రాణనష్టానికి దారితీసిందని ప్రధాని పేర్కొన్నారు. తాజా అంగీకారం ద్వారా పశ్చిమాసియా రీజియన్‌లో శాంతి, స్థిరత్వాలు పునరుద్ధరించబడతాయని భారత్ బలంగా విశ్వసిస్తోందని తెలిపారు. ఈ ఒప్పందం వల్ల అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో స్వేచ్ఛా నౌకాయానం (Free Navigation) మరియు అంతర్జాతీయ వాణిజ్యానికి (Global Trade) గట్టి భరోసా లభిస్తుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.

PM Modi on US-Iran Peace Agreement: అంతర్జాతీయ మార్కెట్లకు భారీ ఊరట

అమెరికా-ఇరాన్ అంగీకారం ద్వారా ముఖ్యంగా ముడి చమురు (Crude Oil) రవాణా జరిగే సముద్ర జలాల్లో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టనున్నాయి. ఇది భారతదేశం వంటి ఇంధన దిగుమతులపై ఆధారపడే దేశాలకు మరియు గ్లోబల్ స్టాక్ మార్కెట్లకు ఎంతో సానుకూలమైన పరిణామంగా ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందంపై ప్రపంచ దేశాలు హర్షం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha