America-Iran War : పశ్చిమ ఆసియాలో రోజురోజుకూ తీవ్రమవుతున్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికా, ఇరాన్‌ల మధ్య జరుగుతున్న యుద్ధంతో ప్రపంచ దేశాలు కలవరపాటుకు గురి అవుతున్నాయి.
మధ్యప్రాచ్యం రగిలిన అగ్నిజ్వాలలు రోజురోజుకూ భీకర రూపం దాల్చుతున్నాయి. అమెరికా – ఇరాన్ (America-Iran) ల మధ్య ప్రారంభమైన ఈ ప్రత్యక్ష పోరాటం, ఇప్పుడు కేవలం ఆ రెండు దేశాలకే పరిమితం కాకుండా మొత్తం పశ్చిమ ఆసియా ప్రాంతాన్ని ఒక వినాశకరమైన యుద్ధంలోకి నెట్టివేసే స్థాయికి చేరుకుంది. వరుసగా పదో రాత్రి కూడా యూఎస్ సెంట్రల్ కమాండ్ నేతృత్వంలో అమెరికా వైమానిక దళాలు ఇరాన్ భూభాగంపై విరుచుకుపడ్డాయి. ఇరాన్ మిలిటరీ కమాండ్ కేంద్రాలు, క్షిపణి, డ్రోన్ ప్రయోగ స్థావరాలు, వ్యూహాత్మక వాయు రక్షణ వ్యవస్థలతో పాటు ప్రాముఖ్యత కలిగిన నావికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి.
Americal-Iran War
America-Iran War : రంగంలోకి హౌతీ తిరుగుబాటుదారులు
అంతర్జాతీయ జలసంధి అయిన హార్ముజ్ గుండా ప్రయాణించే వాణిజ్య, చమురు నౌకల భద్రతను కాపాడటానికే ఈ చర్యలని అమెరికా సమర్థించుకుంటున్నప్పటికీ.. ఈ దాడుల పరిధి క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా దక్షిణ ఇరాన్ పరిధిలోని కీలకమైన బందర్ అబ్బాస్ ఓడరేవు, ఖేష్మ్ ద్వీపం, చబహార్ పరిసర ప్రాంతాలలో భారీ శబ్దాలతో పేలుళ్లు సంభవించినట్లు అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. బుషెహర్ ప్రాంతంలో ఇరాన్ వాయు రక్షణ వ్యవస్థలు నిరంతరం క్రియాశీలంగా మారి శత్రు క్షిపణులను ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ పరిస్థితుల మధ్య, ఇరాన్ ప్రాపకం ఉన్న యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు రంగంలోకి దిగడంతో పరిణామాలు మరింత దారుణంగా మారాయి.
Epaper: epaper.vaartha.com
ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడి: ఒడెసా పోర్టులో నలుగురు భారత నావికులు మృతి

