Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమెరికా - కెనడా మధ్య రగిలిన 'టారిఫ్' వార్

అమెరికా - కెనడా మధ్య రగిలిన 'టారిఫ్' వార్

వార్త 3 weeks ago

Donald Trump: అమెరికా, కెనడాల మధ్య వాణిజ్య వివాదం (Trade War) మరింత ముదిరింది. అమెరికా విధించిన టారిఫ్‌లకు నిరసనగా కెనడా ప్రధాని మార్క్ కార్నీ (Mark Carney) ప్రతికార సుంకాలను (Retaliatory Tariffs) ప్రకటించడంతో, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) కెనడాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Read Also :US Canada Trade War: అమెరికాకు కెనడా బిగ్ షాక్

Donald Trump: వాణిజ్య పోరులో ముఖ్యాంశాలు

  • ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు: “అమెరికాలో ఒక రాష్ట్రంగా పొందే ప్రయోజనాలన్నీ కెనడాకు కావాలి.. కానీ రాష్ట్రంగా మాత్రం ఉండదు! అంతేకాకుండా మా రైతులకు సంబంధించి చాలా ఏళ్లుగా భారీగా టారిఫ్‌లు వసూలు చేస్తున్నారు. ఇకపై అది సాగదు!” అని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా హెచ్చరించారు.
  • కెనడా ప్రతికార సుంకాలు: సెప్టెంబర్ 8 నుంచి అమెరికా నుంచి దిగుమతయ్యే స్టీల్, డైరీ (పాలు/పాల ఉత్పత్తులు) పరిశ్రమలను లక్ష్యంగా చేసుకుని కొత్త టారిఫ్‌లు అమలులోకి వస్తాయని కెనడా ప్రధాని మార్క్ కార్నీ ప్రకటించారు.
  • అమెరికా విధించిన టారిఫ్‌లు: సుమారు 20 బిలియన్ డాలర్ల విలువైన కెనడా వస్తువులపై (కెనడా నుంచి అమెరికాకు అయ్యే ఎగుమతుల్లో 5.5 శాతం) 50 శాతం కొత్త సుంకాలను అమెరికా శనివారం నుంచే అమల్లోకి తెచ్చింది.

ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చలు విఫలం కావడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మరియు గ్లోబల్ సప్లై చైన్‌పై దీని ప్రభావం పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

అమెరికాకు అండగా నిలిస్తే శత్రువులుగా పరిగణిస్తాం.. ఇరాన్ హెచ్చరిక

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha