Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమెరికా క్షీణతపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు: జిన్‌పింగ్‌తో ఏకీభవిస్తూనే బైడెన్‌పై విమర్శలు

అమెరికా క్షీణతపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు: జిన్‌పింగ్‌తో ఏకీభవిస్తూనే బైడెన్‌పై విమర్శలు

వార్త 1 week ago

మెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం చైనా పర్యటనలో వున్నారు. ప్రస్తుతం అయన చేసిన వ్యాఖ్యలు త్రీవ చర్చలకు దారితీస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి.

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ గతంలో చేసిన “అమెరికా క్షీణిస్తున్న దేశం” అనే వ్యాఖ్యలతో తాను 100 శాతం ఏకీభవిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. అయితే, ఆ క్షీణత కేవలం జో బైడెన్ హయాంలోనే జరిగిందని ఆయన స్పష్టం చేశారు. బైడెన్ వైఫల్యాలు:
ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ పోస్ట్‌లో బైడెన్ పాలనను లక్ష్యంగా చేసుకుని పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 Trump

Trump: బైడెన్ వైఫల్యాలను ఎత్తిచూపేందుకు యత్నం

గత నాలుగేళ్లలో సరిహద్దులు తెరిచి ఉంచడం, అధిక పన్నులు, మరియు నేరాల పెరుగుదల వల్ల అమెరికా పతనమైందని ట్రంప్ ఆరోపించారు. వైవిధ్యం-సమానత్వం-సమ్మిళితత్వం (DEI) మరియు మహిళల క్రీడల్లో ట్రాన్స్‌జెండర్ల ప్రవేశం వంటి విధానాలు దేశాన్ని దెబ్బతీశాయని ఆయన పేర్కొన్నారు. తన హయాంలో స్టాక్ మార్కెట్లు ఆల్ టైం గరిష్ఠ స్థాయికి చేరాయని, అమెరికా మళ్లీ ప్రపంచంలోనే అగ్రగామి శక్తిగా ఎదిగిందని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. చైనాతో సంబంధాలు మెరుగ్గా ఉంటాయని ఆశిస్తున్నట్లు చెబుతూనే, వెనెజువెలా, ఇరాన్ వంటి దేశాల విషయంలో తన కఠిన వైఖరిని గుర్తు చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

భారత్ కు చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha