Dailyhunt
అమెరికా పర్యాటక మహిళపై అత్యాచారం

అమెరికా పర్యాటక మహిళపై అత్యాచారం

వార్త 1 week ago

Kodagu crime: కర్ణాటకలోని నాగర్‌హోళే జాతీయ పార్కు సమీపంలో ఉన్న కుట్టా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం వెలుగు చూసింది. వాషింగ్టన్‌కు చెందిన ఒక మహిళ ఒంటరిగా పర్యటిస్తూ, స్థానిక హోమ్‌స్టేలో బస చేసిన సమయంలో ఈ ఘటన జరిగింది.

Read Also :Delhi Crime: IRS అధికారి కుమార్తెపై అత్యాచారం.. ఆపై హత్య!

 They have been remanded until May 3.

అసలేం జరిగింది?

బాధితురాలు సుమారు మూడు రోజుల పాటు సదరు హోమ్‌స్టేలో బస చేశారు. ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్న జార్ఖండ్‌కు చెందిన వృజేష్ కుమార్ అనే వ్యక్తి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన జరిగిన వెంటనే బాధితురాలు అమెరికా రాయబార కార్యాలయం (U.S. Embassy) ద్వారా కొడగు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Kodagu crime: పోలీసుల సత్వర చర్యలు – అరెస్టులు

బాధితురాలి ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు నిందితుడు వృజేష్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. అలాగే, ఈ దారుణాన్ని బయటకు రాకుండా అణిచివేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హోమ్‌స్టే యజమాని విశాల్ పొన్నన్నను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

  • న్యాయస్థానం ఆదేశాలు: వీరిద్దరికీ కోర్టు మే 3 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
  • పోలీసుల క్లారిటీ: బాధితురాలికి మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశారన్న వార్తలను కొడగు ఎస్పీ బిందు మణి కొట్టిపారేశారు. అటువంటి ఆరోపణల్లో నిజం లేదని ఆమె స్పష్టం చేశారు.

హోమ్ మంత్రి హెచ్చరిక

ఈ ఘటనపై కర్ణాటక హోం మంత్రి డాక్టర్ జి. పరమేశ్వర స్పందిస్తూ.. పోలీసులకు సమాచారం అందిన వెంటనే నిందితులను పట్టుకున్నారని తెలిపారు. హోమ్‌స్టేల నిర్వహణకు సంబంధించి కఠినమైన నిబంధనలు (SOPs) ఉన్నాయని, వాటిని ఉల్లంఘించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పర్యాటకుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని మంత్రి స్పష్టం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

కొత్తగా ప్రపోజ్ చేస్తానంది..అసలేం జరిగింది ?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha