Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమెరికా టెక్నాలజీ స్టాక్స్లో అమ్మకాల దెబ్బకు మార్కెట్లపై ఒత్తిడి

అమెరికా టెక్నాలజీ స్టాక్స్లో అమ్మకాల దెబ్బకు మార్కెట్లపై ఒత్తిడి

వార్త 1 week ago

Stock Market : అమెరికా షేర్ మార్కెట్లలో ప్రముఖ టెక్నాలజీ కంపెనీల స్టాక్స్ తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. గడిచిన కేవలం 4 రోజుల్లోనే టెస్లా, మెటా, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్ (గూగుల్), అమెజాన్, ఎన్విడియా వంటి దిగ్గజ 'మేగ్నిఫిసెంట్ 7' టెక్ కంపెనీలకు చెందిన దాదాపు రూ.

114 లక్షల కోట్ల ($1.3 ట్రిలియన్లకు పైగా) మార్కెట్ మూలధనం ఆవిరైపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత అభివృద్ధి కోసం ఈ కంపెనీలు భారీగా చేస్తున్ను మూలధన వ్యయం (Capital Expenditure), దానికి తగినట్లుగా తక్షణ రాబడులు (Returns) రాకపోవడంపై ఇన్వెస్టర్లలో అనుమానాలు మొదలయ్యాయి. ఎంతకాలం పాటు ఈ విధమైన భారీ వ్యయాలు కొనసాగుతాయనే ఆందోళన మార్కెట్లో అమ్మకాల సెగను పెంచింది.

మార్కెట్లపై ఒత్తిడి – దిగ్గజ కంపెనీల భవిష్యత్ వ్యూహాలు

సాబ్డిస్క్ సహా అనేక చిప్ తయారీ, సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల సంస్థలు ఈ క్షీణత వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యాయి. కంపెనీల ఆదాయ నివేదికలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, కేవలం ఏఐ రంగానికే ప్రాధాన్యతనిస్తూ ఇతర ఆదాయ వనరులు మందగించడం వాల్ స్ట్రీట్ (Wall Street) సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో ఇన్వెస్టర్లు సురక్షితమైన ఇతర రంగాల వైపు లేదా లాభాల స్వీకరణ (Profit Booking) వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పరిస్థితులు కేవలం అమెరికా మార్కెట్లకే కాకుండా భారతీయ ఐటీ రంగానికి మరియు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లకు కూడా ప్రతికూల సంకేతాలను పంపుతున్నాయి.

ఎల్ఐసి పాలసీదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha