JD Vance Fraud Czar: అమెరికా రాజకీయాల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న మరో సంచలన నిర్ణయం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ, ఆయనను దేశపు 'ఫ్రాడ్ జార్' (Fraud Czar) గా నియమించారు.
ప్రభుత్వ నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడమే లక్ష్యంగా ఈ నియామకం జరిగినట్లు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి.
Read Also: Iran-America War: ఇస్లామాబాద్ శాంతి మధ్యవర్తిత్యాన్ని తిరస్కరించిన ఇరాన్
జేడీ వాన్స్‌కు ప్రత్యేక అధికారాలు
ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో జరుగుతున్న భారీ అవినీతిని వెలికితీసేందుకు ఏర్పాటు చేసిన జాతీయ టాస్క్‌ఫోర్స్‌కు జేడీ వాన్స్ నాయకత్వం వహిస్తారని ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో ప్రకటించారు.అమెరికా బడ్జెట్‌ను బ్యాలెన్స్ చేయడమే ధ్యేయంగా, నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడం.ఈ దర్యాప్తు ప్రధానంగా డెమొక్రాటిక్ పార్టీ అధికారంలో ఉన్న కాలిఫోర్నియా, ఇల్లినాయిస్, న్యూయార్క్ వంటి రాష్ట్రాలపై కేంద్రీకృతమవుతుందని ట్రంప్ స్పష్టం చేశారు.
JD Vance Appointed Fraud Czar
JD Vance Fraud Czar: ప్రకటన వెలువడిన వెంటనే దాడులు
ఈ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుపై మార్చి 2026లో కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేయగా, తాజాగా దీని ప్రభావం క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది.హెల్త్‌కేర్ సిస్టమ్‌లో సుమారు 50 మిలియన్ డాలర్ల మేర మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎనిమిది మందిపై ఫెడరల్ అధికారులు కేసులు నమోదు చేశారు.దర్యాప్తు సంస్థల ద్వారా రాజకీయ ప్రత్యర్థుల కోటల్లోని అవినీతిని బయటపెట్టడం ద్వారా డెమొక్రాట్లను ఇరకాటంలో పెట్టాలని ట్రంప్ యోచిస్తున్నారు.
ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని డెమొక్రాటిక్ నేషనల్ కమిటీ (DNC) తీవ్రంగా ఖండించింది. ఇది అవినీతిపై పోరాటం కాదని, కేవలం తమ పార్టీ పాలిత రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న రాజకీయ దాడి అని డీఎన్‌సీ చైర్ కెన్ మార్టిన్ ఆరోపించారు.ఉపాధ్యక్షుడికి ఇలాంటి దర్యాప్తు అధికారాలు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని డెమొక్రాట్లు వాదిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

