Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమెరికాలో ఘోర ప్రమాదం.. వినుకొండ యువతి మక్కెన ప్రసన్న దుర్మరణం!

అమెరికాలో ఘోర ప్రమాదం.. వినుకొండ యువతి మక్కెన ప్రసన్న దుర్మరణం!

వార్త 3 weeks ago

Makkena Prasanna: ఉన్నత చదువులు చదివి, జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే కలతో అమెరికా వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక యువతి రోడ్డు ప్రమాద రూపంలో అనంత లోకాలకు చేరింది.

పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గ పరిధిలోని ఉమ్మడివరం గ్రామానికి చెందిన మక్కెన ప్రసన్న (27) అనే యువతి అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ విషాద వార్త ఆమె సొంత గ్రామంలో తీవ్ర శోకాన్ని నింపింది. మక్కెన ప్రసన్న విద్యాభ్యాసంలో ఎంతో చురుకైనది. విద్యాభ్యాసం కోసం అమెరికాలోని న్యూజెర్సీకి వెళ్లారు. అక్కడ విజయవంతంగా ఎంఎస్ (MS) కోర్సును పూర్తి చేసి, మంచి కంపెనీలో స్థిరపడాలనే లక్ష్యంతో ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు. త్వరలోనే మంచి ఉద్యోగం సాధించి జీవితంలో స్థిరపడుతుందని కుటుంబ సభ్యులు ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో ఈ ఘోర ప్రమాదం జరిగి ఆమె ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది.

Read Also : Mudragada Died : అధికారిక లాంఛనాలతో ముద్రగడ అంత్యక్రియలు

Makkena Prasanna: అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన అద్దె కారు

ప్రమాదం జరిగిన రోజు ప్రసన్న తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందుకోసం వారు ఒక అద్దె కారును (Rented Car) తీసుకున్నారు. కార్యక్రమం ముగిసిన తర్వాత తిరిగి వస్తుండగా, వారు ప్రయాణిస్తున్న కారు అకస్మాత్తుగా అదుపుతప్పింది. వేగంగా దూసుకెళ్లిన ఆ కారు రోడ్డు పక్కన ఉన్న ఒక పెద్ద చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో కారు తీవ్రంగా దెబ్బతినగా, అందులో ప్రయాణిస్తున్న వారందరికీ తీవ్ర గాయాలయ్యాయి. ప్రసన్న పరిస్థితి అత్యంత విషమంగా ఉండడంతో ఆమెను తక్షణమే సమీపంలోని ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందించారు. అక్కడ వైద్యులు శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ, ఫలితం లేకపోయింది. తీవ్ర గాయాల కారణంగా చికిత్స పొందుతూ ప్రసన్న ఆసుపత్రిలోనే తుదిశ్వాస విడిచింది. ప్రసన్న మరణవార్త విన్న ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

తిరుపతిలో వృద్ధురాలి దారుణ హత్య!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha