Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమెరికాలో పార్ట్‌టైమ్ మెహందీ జాబ్.. గంటకు రూ.9 వేలకుపైగా సంపాదన..!

అమెరికాలో పార్ట్‌టైమ్ మెహందీ జాబ్.. గంటకు రూ.9 వేలకుపైగా సంపాదన..!

వార్త 1 week ago

Parti Time Mehandi Job : అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తూనే తన కళను ఆదాయ వనరుగా మార్చుకున్న భారతీయ మహిళ ప్రియాంక (Parti Time Mehandi Job) జైన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు.

ఉద్యోగంతో పాటు పార్ట్‌టైమ్‌గా మెహందీ ఆర్టిస్ట్‌గా పనిచేస్తూ మంచి ఆదాయం పొందుతున్నట్లు ఆమె స్వయంగా వెల్లడించారు. ఆమె కథపై తాజాగా పలు మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి.

గంటకు సుమారు 100 డాలర్లు వరకు ఛార్జ్ :

ప్రియాంక జైన్ తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికాలో మెహందీ డిజైనింగ్‌కు గంటకు సుమారు 100 డాలర్లు వరకు ఛార్జ్ చేస్తున్నారు. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.9,000 – 10,000కు సమానం. పెళ్లిళ్లు, ప్రత్యేక కార్యక్రమాల్లో ఎక్కువ గంటల పాటు బుకింగ్‌లు వస్తే ఒక్క ఈవెంట్‌ ద్వారానే గణనీయమైన ఆదాయం పొందుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో పెళ్లి వేడుకల కోసం దాదాపు 10 గంటలు పనిచేస్తే సుమారు రూ.లక్ష వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందని ఆమె వీడియోలో వివరించారు.

అయితే అమెరికాలో ఆదాయం ఎక్కువగా ఉన్నట్టే జీవన వ్యయం, వ్యాపార నిర్వహణ ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయని ప్రియాంక స్పష్టం చేశారు. అందువల్ల మొత్తం సంపాదనను నేరుగా లాభంగా చూడలేమని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ కథలో తనకు డబ్బు కంటే మరో విషయం ముఖ్యమని ప్రియాంక చెబుతున్నారు. అమెరికాలో మెహందీ వంటి సంప్రదాయ కళలను ప్రొఫెషనల్‌గా చేస్తున్నప్పుడు 'ఆర్టిస్ట్'గా గుర్తింపు, గౌరవం లభించడం తనకు ఎంతో సంతోషాన్నిస్తోందని తెలిపారు.

కొందరు మెహందీ పనిని పూర్తిస్థాయి వృత్తిగా పరిగణించకపోయినా, తాను మాత్రం దానిని తన సృజనాత్మకతకు, నైపుణ్యానికి ప్రతిఫలంగా చూస్తున్నట్లు పేర్కొన్నారు. ఒకవైపు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. మరోవైపు భారతీయ సంప్రదాయ కళ. తనకున్న నైపుణ్యాన్ని అవకాశంగా మార్చుకుంటే విదేశాల్లోనూ పార్ట్‌టైమ్‌ వ్యాపారంతో మంచి ఆదాయం పొందవచ్చనే విషయాన్ని ప్రియాంక జైన్ కథ మరోసారి చూపిస్తోంది.

రాజీవ్ తల్రేజాతో ప్రతిష్టాత్మక భాగస్వామ్యం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha