Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమెరికాతో చర్చలకు ఇరాన్ నో

అమెరికాతో చర్చలకు ఇరాన్ నో

వార్త 2 months ago

రెండోసారి చర్చలకు ఇరాన్ నిరాకరణ

Iran US peace talks : అమెరికాతో జరగాల్సిన రెండో రౌండ్ శాంతి చర్చల్లో పాల్గొనబోమని ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది.

పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగిన మొదటి దశ చర్చలు విఫలమైన నేపథ్యంలో మరోసారి చర్చలు జరగనున్నాయనే వార్తలు వచ్చాయి. అయితే ఈ చర్చల్లో పాల్గొనబోమని ఇరాన్ స్పష్టం చేసింది.

అమెరికా డిమాండ్లపై అసంతృప్తి

అమెరికా విధిస్తున్న మితిమీరిన డిమాండ్లు, అవాస్తవిక అంచనాలు కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ తెలిపింది. చర్చల గురించి అమెరికా విడుదల చేస్తున్న నివేదికలు కేవలం ఇరాన్‌ను ఇబ్బంది పెట్టేందుకు చేస్తున్న మీడియా గేమ్ మాత్రమేనని పేర్కొంది.

Read also: Strait of Hormuz: యూరోపియన్ యూనియన్ తీరుపై ఇరాన్ ఆగ్రహం

 Iran US peace talks

ఉద్రిక్తతలు మళ్లీ పెరగనున్నాయా?

ఇటీవల అమెరికా హర్మూజ్ జలసంధి, ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధం విధించడం కాల్పుల విరమణ ఒప్పందానికి విరుద్ధమని ఇరాన్ ఆరోపిస్తోంది. ఏప్రిల్ 22న కాల్పుల విరమణ గడువు ముగియనున్న నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరిగే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ట్రంప్‌కు హౌతీలు వార్నింగ్: అసలు ఏం జరగబోతోంది?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha