ఇరాన్, అమెరికాల మధ్య కాల్పులు జరగడంతో, పెళుసుగా ఉన్న కాల్పుల విరమణ ఒప్పందం దెబ్బతిన్న నేపథ్యంలో, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను తగ్గించాలని సౌదీ అరేబియా మంగళవారం పిలుపునిచ్చింది.
“ఈ ప్రాంతంలో ప్రస్తుత సైనిక ఉద్రిక్తతల పట్ల సౌదీ అరేబియా రాజ్యం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఉద్రిక్తతలను తగ్గించాల్సిన అవసరం ఉందని పిలుపునిస్తోంది,” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ Xలో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఈ యుద్ధంలో “రాజకీయ పరిష్కారం కోసం దౌత్య ప్రయత్నాలకు” తాము మద్దతు ఇస్తున్నామని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
Read Also: Iran-America War: యుద్ధాన్ని ముగించడమే తమ "ప్రాధాన్యత": ఇరాన్
Breaking News
Breaking News: కొనసాగుతున్న హర్మూజ్ ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ఆపరేషన్
ఇదిలా ఉండగా, హర్మూజ్ ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ఆపరేషన్ కొనసాగుతున్న సమయంలో ఇరాన్‌కు చెందిన ఏడు చిన్న పడవలను కూల్చివేశామని ట్రంప్ తెలిపారు. ట్రూత్ సోషల్‌లో చేసిన పోస్టులో ఈ వివరాలు వెల్లడించారు. ‘మేము ఏడు చిన్న పడవలను కూల్చివేశాం. వాటిని వారు ఫాస్ట్ బోట్స్ అని పిలుస్తారు. ఇప్పుడు అవే వారి దగ్గర మిగిలాయి. నౌకల కదలికల విషయంలో ఇరాన్ సంబంధం లేని దేశాలను లక్ష్యంగా చేసుకుంది ఆరోపించారు. దక్షిణ కొరియా సరకు నౌకపై జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ, సియోల్ కూడా అమెరికా నేతృత్వంలోని ఈ మిషన్‌లో చేరాల్సిన సమయం వచ్చింది. ఆ ఘటనను మినహాయిస్తే ఇతర పెద్ద నష్టం ఏదీ సంభవించలేదు’ అని ట్రంప్ తెలిపారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :

