US Ending Canada Freeride : కెనడా దశాబ్దాలుగా అమెరికా నుంచి ఉచిత ప్రయోజనాలు పొందుతూ మోసం చేస్తోందని వైట్‌హౌస్ స్పష్టం చేసింది. కెనడా అనుసరిస్తున్న అన్యాయమైన, వివక్షపూరిత వాణిజ్య విధానాలను ఇకపై ఎంతమాత్రం సహించబోమని హెచ్చరించింది.గత పదేళ్లలో ఏటా సగటున 50 బిలియన్ డాలర్ల మేర వాణిజ్య లాభాన్ని కెనడా పొందిందని, ప్రతిగా అమెరికాకు సమాన అవకాశాలు ఇవ్వలేదని అమెరికా తెలిపింది.
అమెరికా ఆటోమొబైల్స్‌పై 25% సుంకాలు, డెయిరీ ఉత్పత్తులపై తీవ్ర పరిమితులు, ఆల్కహాల్ ఎగుమతులపై ఆంక్షలు విధించడం వల్ల అమెరికా తీవ్రంగా నష్టపోయిందని పేర్కొంది. కెనడా తమ దేశ రైతులను, కంపెనీలను మోసగిస్తూ కొన్ని ఉత్పత్తులపై 400 శాతం వరకు టారిఫ్‌లు వసూలు చేసిందని ట్రంప్ ఆరోపించారు. కెనడా అమెరికాలో ఒక రాష్ట్రం కాదని, వారికి ఎటువంటి ప్రత్యేక ఉచిత హక్కులు ఉండవని తేల్చి చెప్పారు. కెనడా తన మొత్తం ఎగుమతుల్లో 75 శాతం అమెరికాకే పంపుతోందని, అమెరికా మద్దతు లేకపోతే కెనడా ఆర్థిక వ్యవస్థ మనుగడ కష్టమని వైట్‌హౌస్ గుర్తుచేసింది. కెనడా కంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ 13 రెట్లు పెద్దదని తెలిపింది.
Read Also: Imran Khan Health: ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై కుమారులు తీవ్ర ఆందోళన
US Ending Canada Freeride
అమెరికా ఏకపక్షంగా విధించిన 50 శాతం సుంకాలపై కెనడా ప్రధాని మార్క్ కార్నే గట్టిగా స్పందించారు. డాలర్‌కు డాలర్ చొప్పున అమెరికా ఉత్పత్తులపై 50 శాతం వరకు ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా తమ దేశ కార్మికులు, వ్యాపారాల రక్షణకు 7.5 బిలియన్ డాలర్ల అదనపు ఆర్థిక ప్యాకేజీని కూడా ప్రకటించారు.
US Ending Canada Freeride : 50 శాతం వరకు సుంకాలు: కెనడా ప్రధాని
అమెరికా ఏకపక్షంగా విధించిన 50 శాతం సుంకాలపై కెనడా కూడా గట్టిగా స్పందించింది. కెనడియన్ కార్మికులు, పరిశ్రమలు, కుటుంబాల ప్రయోజనాలను కాపాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆ దేశ ప్రధాన మంత్రి మార్క్ కార్నే ప్రకటించారు. అమెరికా విధించే ప్రతి టారిఫ్‌కు డాలర్‌కు డాలర్ చొప్పున ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు అమెరికా ఉత్పత్తులపై 50శాతం వరకు సుంకాలను విధిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే, కెనడియన్ కార్మికులు, వ్యాపార వర్గాలకు మద్దతుగా అదనంగా 7.5 బిలియన్ డాలర్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రవేశపెడుతున్నట్లు కార్నే వెల్లడించారు. ఇప్పటికే సుంకాల అమలుకు వ్యతిరేకంగా సుమారు 25 బిలియన్ డాలర్ల మద్దతు అందించామని, ఇప్పుడు ఈ కొత్త చర్యలతో కెనడా ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేస్తామని ఆయన ‘ఎక్స్’ వేదికగా తెలిపారు.

