Ameerpet traffic:హైదరాబాద్ నగరంలో రద్దీ ప్రాంతమైన అమీర్‌పేట్‌లో అమీర్‌పేట్‌లో భారీ ట్రాఫిక్ సమస్య చాలా పెరిగిపోయింది. ఫుట్‌పాత్‌లతో పాటు ప్రధాన రహదారులపైనే వీధి వ్యాపారులు దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు.
దీనివల్ల నిత్యం వాహనదారులు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. సాయంత్రం వేళల్లో ఈ మార్గంలో ప్రయాణించడం చాలా కష్టంగా మారుతోంది. కనీసం జనాలు నడిచి వెళ్లడానికి దారి లేకపోవడంతో ప్రజలు రోడ్డుపైనే నడవాల్సి వస్తోంది. ప్రతి రోజు 1 గంట సమయం ట్రాఫిక్‌లోనే వృథా అవుతోందని ద్విచక్ర వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ప్రమాదాలు కూడా ఎక్కువ అవుతున్నాయి.
Shops set up on the road in Ameerpet
Hyderabad Metro: మెట్రోకి 60 కొత్త కోచ్‌లు
ఫుట్‌పాత్ ఆక్రమణలు, పాదచారుల ఇబ్బందులు
ఎక్కడ ఖాళీ కనిపిస్తే అక్కడ కబ్జా చేయడం వ్యాపారులకు అలవాటుగా మారింది. అమీర్‌పేట్ వీధుల్లో కర్రలు పాతడం టెంట్లు వేసి వ్యాపారాలు నడిపిస్తున్నారు. అధికారులు అడగకపోవడంతో రోడ్లపైనే అమ్మకాలు సాగిస్తున్నారు. రాకపోకలకు దారి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ ఆగిపోయినా మాకేం సంబంధం లేదనే ధోరణిలో వ్యాపారులు ఉంటున్నారు. రోడ్డు పక్కన తాత్కాలిక షాపుల వల్ల ప్రతి రోజు గంటల తరబడి వాహనాలు ఆగిపోతున్నాయి. సమస్యను పరిష్కరించాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.
Ameerpet traffic:మైత్రివనం వద్ద కిలోమీటర్ల మేర వాహనాల నిలిపివేత
అమీర్‌పేట్ మైత్రివనం సిగ్నల్ దాటిన తర్వాత పంజాగుట్టవైపు వెళ్లే రోడ్డులో సమస్య చాలా ఎక్కువ అవుతోంది. అక్కడ 2 నుంచి 3 కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోతున్నాయి. షాపింగ్ మాల్స్ ముందు రోడ్డులో ఒక వరుసను వ్యాపారులు ఆక్రమిస్తున్నారు. ఇక్కడ పార్కింగ్ స్థలం లేకపోవడం వల్ల కొనుగోలుదారులు రోడ్డుపైనే వాహనాలు నిలుపుతున్నారు. దీనివల్ల ప్రయాణం చాలా నిమిషాలు ఆలస్యం అవుతోంది. సరైన ప్రత్యామ్నాయం చూపితేనే ఈ రద్దీ తగ్గుతుందని వాహనదారులు స్పష్టం చేస్తున్నారు.
Epaper: epaper.vaartha.com

