CM Vijay : తమిళనాడు ముఖ్యమంత్రి C. Joseph Vijay మరియు కేంద్ర హోంమంత్రి Amit Shah భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. చెన్నై వేదికగా జరిగిన ఈ సమావేశంలో దక్షిణ భారతదేశ రాష్ట్రాల అభివృద్ధి, ప్రాంతీయ సమస్యలు మరియు కేంద్ర-రాష్ట్ర (CM Vijay ) సంబంధాలపై ఇరు నేతలు విస్తృతంగా చర్చించారు.
చెన్నైలో పర్యటిస్తున్న కేంద్ర హోంమంత్రికి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఆతిథ్యం అందించారు. దక్షిణ ప్రాంతీయ మండలి (Southern Zonal Council) సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన అమిత్ షాతో సీఎం విజయ్ సమావేశం కావడం, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. పాలిటిక్స్‌లోకి అడుగుపెట్టిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో ఈ ఇద్దరు నేతలు ఎదురుపడటం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

విజయ్ సీఎం గా అయిన తర్వాత అమిత్ షా మొదటిసారి తమిళనాడు పర్యటనకు రావడం తో ఆయన అమిత్ షాకు తన ఇంటి నుంచి ప్రత్యేక విందుని ఏర్పాటు చేయడం విశేషంగా మారింది.
రాష్ట్రం అభివృద్ధి కోసం విజయ్ ఇప్పటికే తన మార్క్ పరిపాలన విధానాలను చేస్తుండగా కేంద్రంతో కూడా కయ్యం కాకుండా మంచి కలుపుగోలుగా ఉండాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ప్రత్యేక సమావేశం సందర్భంగా ఇరు నేతల మధ్య రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల పురోగతిపై చర్చ జరిగినట్లు తెలుస్తుంది.

