Gautam Gambhir: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న మాజీ క్రికెటర్, మాజీ ఎంపీ గౌతమ్ గంభీర్ తాజాగా దేశ రాజధానిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ఈ సమావేశం అత్యంత సౌహార్ధ వాతావరణంలో జరిగింది. ఈ సందర్భంగా గంభీర్ స్వయంగా అమిత్ షాను కలిసి, ఆయనతో కొంతసేపు పలు అంశాలపై ముచ్చటించారు.
గణేష్ విగ్రహం అందజేత.. సోషల్ మీడియాలో ఫొటోలు షేర్
ఈ భేటీ సందర్భంగా గౌతమ్ గంభీర్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ప్రత్యేకంగా వినాయకుడి (గణేష్) అందమైన విగ్రహాన్ని కానుకగా బహుకరించారు. ఈ సమావేశానికి సంబంధించిన విశేషాలను, ఫొటోలను గంభీర్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తనకు విలువైన సమయం కేటాయించినందుకు, ఎల్లప్పుడూ సరైన మార్గదర్శకత్వం అందిస్తున్నందుకు అమిత్ షాకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

