Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అనంతపురం నగరంలో ఘనంగా టిడిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

అనంతపురం నగరంలో ఘనంగా టిడిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

వార్త 2 months ago

ర్బన్ టిడిపి కార్యాలయంలో నిర్వహించిన వేడుకలలో పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు గారు

కమ్మ భవన్ వద్ద పూల నాగరాజు గారి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం

పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన నాయకులు, అభినందించిన పూల నాగరాజు గారు

Read Also:AP Disaster Management: ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు

TDP Formation Day: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అనంతపురం నగరంలో పలు కార్యక్రమాలలో అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు గారు పాల్గొన్నారు. అనంతపురం అర్బన్ టిడిపి కార్యాలయం నందు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలలో పూల నాగరాజు గారు పాల్గొన్నారు. టిడిపి జెండాను ఆవిష్కరించి, ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం శాప్ డైరెక్టర్ బొమ్మినేని శివ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత సైకిళ్ళ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 Telugu Desam Party Celebrations

TDP Formation Day: 250 మంది విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీ

ప్రభుత్వ పాఠశాలలోని దాదాపు 250మంది విద్యార్థిని, విద్యార్థులకు బొమ్మినేని శివ గారు సైకిళ్ళను ఉచితంగా అందించడంపై ఆయనను పూల నాగరాజు గారు అభినందించారు. కమ్మ భవన్ వద్ద జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు గారి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. టిడిపి నాయకులు, కమ్మ సంఘం నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పూల నాగరాజు గారు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. టిడిపి మైనార్టీ నేత, మాజీ జెడ్పీ చైర్మన్ చమన్ సాబ్ గారి తనయుడు ఉమర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలలో పూల నాగరాజు గారు పాల్గొన్నారు. టిడిపి ఆవిర్భావ దినోత్సవం రోజున సేవా కార్యక్రమాలు నిర్వహించిన వారిని పూల నాగరాజు గారు అభినందించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha