Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అందమైన గోళ్లు - ఆరోగ్యకరమైన జీవితం

అందమైన గోళ్లు - ఆరోగ్యకరమైన జీవితం

వార్త 0 months ago

Nail hygiene : మన శరీరంలో గోళ్లు చాలా చిన్న భాగమే అయినప్పటికీ, మన మొత్తం ఆరోగ్య రక్షణలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. 'గోళ్ల శుభ్రతే ఆరోగ్యం' అనేది కేవలం ఒక నినాదం కాదు, అది నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ పాటించాల్సిన ముఖ్యమైన సూత్రం.

ఆరోగ్యంపట్ల ఎంత జాగ్రత్తగా ఉన్నా.. చిన్న చిన్న తప్పులు పెను ముప్పులకు దారితీస్తాయి. ముఖ్యంగా చాలామంది గోళ్ల విషయంలో అశ్రద్ధ వహిస్తుంటారు. ఈ కారణంగా రకరకాల రుగ్మతలు పలకరిస్తాయి. మనదేశంలో అందరం చేత్తో భోజనం చేస్తాం కాబట్టి గోళ్లు శుభ్రం చేసుకోవడం అత్యంత అవసరం. లేదంటే రకరకాల బ్యాక్టీరియా పెరిగేందుకు గోళ్లే స్థావరంగా మారిపోతాయి. భోజనం తినే ముందు, తిన్న తర్వాత చేతులతో పాటు గోళ్ల సందులను కూడా శుభ్రంగా కడుక్కోవాలి.

Read Also : Fennel Seeds: భోజనం తర్వాత చిటికెడు సోంపు.. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు

 Nail hygiene

Nail hygiene : ఆరోగ్య సమస్యలకు దూరం

అంతేకాదు, వివిధ రసాయనాలతో తయారు చేసిన డిష్‌వాషర్లతో అంట్లు తోమినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. అవి గోళ్లలోకి వెళ్లి తద్వారా భోజన సమయంలో నోట్లోకి చేరే అవకాశం ఉంటుంది. ఇంకా ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండేందుకు, గోళ్లను పొడవుగా పెంచుకోకుండా ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలి. గోళ్లను సరిగ్గా కత్తిరించుకోకపోతే వాటి కింద ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఏర్పడి, గోళ్లు రంగు మారి విరిగిపోయే ప్రమాదం ఉంది. చాలా మందికి ఒత్తిడిలోనో, ఖాళీగా ఉన్నప్పుడో గోళ్లు కొరికే అలవాటు ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరం. గోళ్లలోని క్రిములు నేరుగా నోట్లోకి వెళ్లడమే కాకుండా, వేళ్ల చుట్టూ ఉండే చర్మం పాడై ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఒకరు ఉపయోగించిన నెయిల్ కట్టర్‌ను మరొకరు వాడేటప్పుడు శుభ్రం చేయాలి. దీనివల్ల ఒకరి నుంచి ఒకరికి ఫంగస్ వ్యాపించకుండా ఉంటుంది. పిల్లలు మట్టిలో ఆడుకుంటూ ఉంటారు కాబట్టి వారి గోళ్లలో మురికి త్వరగా చేరుతుంది. తల్లిదండ్రులు పిల్లల గోళ్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ శుభ్రం చేయాలి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

జుట్టు కుచ్చులుగా రాలడం వెనుక కారణాలు..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha