Dailyhunt
Andhra Pradesh: కందుల జాహ్నవి తండ్రి శ్రీకాంత్ మృతి

Andhra Pradesh: కందుల జాహ్నవి తండ్రి శ్రీకాంత్ మృతి

వార్త 1 month ago

మెరికాలో పోలీస్ అధికారి నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయిన తెలుగమ్మాయి జాహ్నవి కందుల కుటుంబాన్ని మరో విషాదం వెంటాడింది. కుమార్తెను కోల్పోయిన దుఃఖం నుంచి ఇంకా తేరుకోకముందే ఆమె తండ్రి కందుల శ్రీకాంత్ గుండెపోటుతో మృతి చెందారు.

ఆయన అంత్యక్రియల్ని కర్నూలు జిల్లా ఆదోనిలో నిర్వహించారు. జాహ్నవి కుటుంబానికి సియాటెల్‌ ప్రభుత్వం 29 మిలియ్ డాలర్లు (దాదాపు రూ.262.75 కోట్లు) పరిహారం చెల్లిస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. ఆ ప్రకటనకు రెండు రోజుల ముందే శ్రీకాంత్ కన్నుమూశారు.

Chittoor: కారుపై కంటైనర్‌ బోల్తా.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి

శ్రీకాంత్ కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన హెడ్ కానిస్టేబుల్. జాహ్నవి మరణం తర్వాత ఆయన మానసికంగా పూర్తిగా కుంగిపోయారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆ బాధతోనే చాలా రోజుల పాటు విధులకు దూరంగా ఉన్నారు. తాజాగా అనంతపురం జిల్లా గుంతకల్లులో పోస్టింగ్ రావడంతో విధుల్లో చేరేందుకు వెళ్లారు. అక్కడే అసలు విషాదం జరిగింది. గుంతకల్లు రైల్వే స్టేషన్ నుంచి ఆటోలో వెళ్తుండగా శ్రీకాంత్‌కు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. ఎంత ప్రయత్నించినా ఆయనను కాపాడలేకపోయారు.

అక్కడికక్కడే మృతి చెందిన జాహ్నవి

పరిహారం వస్తోంది అనే విషయం కూడా తెలియకుండానే ఆయన వెళ్లిపోయారని జాహ్నవి మామయ్య శ్రీధర్ తెలిపారు. జాహ్నవికి న్యాయం కోసం చివరి వరకు నిలబడ్డ వ్యక్తి.. ఆ ఫలితం చూడకుండానే చనిపోవడం తట్టుకోలేని బాధ అని ఆవేదన వ్యక్తం చేశారు.జాహ్నవి 2021లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. సియాటెల్‌లోని నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తున్నారు. 2023 జనవరి 23 రాత్రి రోడ్డు దాటుతున్న సమయంలో పోలీసు పెట్రోలింగ్ వాహనం ఆమెను ఢీకొట్టింది.

జాహ్నవి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ కేసులో కీలకంగా బయటపడింది.. పోలీసు అధికారి కెవిన్ డేవ్ ఓవర్ స్పీడ్‌తో వాహనం నడపడం. 40 కిలోమీటర్ల పరిమితి ఉన్న చోట.. 119 కిలోమీటర్ల వేగంతో వాహనం నడిపినట్లు విచారణలో తేలింది.అంతేకాదు.. ప్రమాదం తర్వాత జాహ్నవి మరణాన్ని తక్కువ చేసి మరో పోలీస్ అధికారి డేనియల్ ఆడరర్ మాట్లాడిన మాటలు కూడా బాడీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో వెలుగులోకి రావడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. జాహ్నవి కుటుంబానికి పరిహారం చెల్లించాలనే నిర్ణయాన్ని సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్ ప్రకటించారు.

Read hindi news: hindi.vaartha.com

Threat: రణ్‌వీర్‌ సింగ్‌, రోహిత్‌ శెట్టికి చంపేస్తామంటూ బెదిరింపులు?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha