Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Andhra Pradesh: రేపటికి వాయిదా పడ్డ ఏపీ శాసనమండలి

Andhra Pradesh: రేపటికి వాయిదా పడ్డ ఏపీ శాసనమండలి

వార్త 4 months ago

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సమావేశాలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. ఈ లోపు సభలో చేపట్టాల్సిన అంశాలపై బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది.

బీఏసీ నిర్ణయం ప్రకారం, మంగళవారం మండలిలో రాష్ట్రంలోని లా అండ్ ఆర్డర్ అంశంపై చర్చ జరగనుంది. రాష్ట్రంలో జరుగుతున్న నేరాలు, పోలీసుల పనితీరుపై ప్రతిపక్షాలు, అధికార పక్షం మధ్య వాడీవేడి చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది.

కీలక అంశాల పై చర్చ

నవంబర్ 25 రాష్ట్రంలోని వ్యవసాయ రంగం, రైతుల సమస్యలపై, నవంబర్ 26దేశవ్యాప్తంగా సంచలనం రేపిన తిరుమల కల్తీ లడ్డూ అంశంపై ప్రత్యేక చర్చ. ఈ ప్రధాన అంశాలతో పాటు రాష్ట్రంలో పెట్టుబడులు, ఇరిగేషన్, ఎడ్యుకేషన్ వంటి ముఖ్యమైన విషయాలపై చర్చలు చేపట్టాలని నిర్ణయించారు.

ముఖ్యంగా తిరుమల లడ్డూ, శాంతిభద్రతల అంశాలపై ప్రభుత్వం (AP Government) తన వాదనను బలంగా వినిపించాలని చూస్తోంది. అదే సమయంలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. మొత్తానికి ఈ వారం శాసన మండలి సమావేశాలు అత్యంత ఆసక్తికరంగా సాగనున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha